Ashwini Dutt Releases a video regarding Chandrababu arrest:టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఇక ఈ విషయం మీద ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి నారా రోహిత్ స్పందించారు. అలాగే ‘ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది, ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం అని ఏపీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి’ ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. మరోవైపు మరో సినీ నిర్మాత నట్టి కుమార్ కూడా నిన్న చంద్రబాబుకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు చిత్రపరిశ్రమకు శ్రేయోభిలాషి వంటి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే చిత్ర పరిశ్రమ పెద్దలు ఎవరూ స్పందించకపోవడం దారుణమని కామెంట్లు చేశారు.
China: తైవాన్ ని చుట్టుముడుతున్న చైనా.. 24 గంటల్లో 22 యుద్ధవిమానాలు, 20 యుద్ధనౌకలు
ఇక తాజాగా ఈ విషయం మీద సినీ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. బాబుని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్న ఆయన అదొక దురదృష్టకరమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ ను, ఒక గొప్ప లోక్ సభ స్పీకర్ ను, ఒక గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ది గ్రేట్ లెజెండ్ చంద్రబాబును ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేసి, లేనిపోని బీభత్సం చేసిన వారికి కచ్చితంగా పుట్టగతులు ఉండవు అని శాపనార్ధాలు పెట్టారు. దీనికి పరిష్కారం త్వరలోనే రాబోతోందని మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా 160 సీట్లను గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక సినీ పరిశ్రమ నుంచి ఇంకా ఎవరైనా ఈ అరెస్టుల గురించి మాట్లాడతారేమో చూడాలి.