Site icon NTV Telugu

Ashwini Dutt : బాబు అరెస్ట్.. సినీ పరిశ్రమపై అశ్వినీదత్ కీలక వ్యాఖ్యలు

Ashwini Dutt

Ashwini Dutt

Ashwini Dutt Crucial Comments on Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని విమర్శలు టీడీపీ సానుభూతిపరులు చేస్తున్నారు. ఇక తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమకు చెందిన నటుడు-నిర్మాత మురళీమోహన్, నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు.

MAD Movie: జాతి రత్నాలు కంటే ఒక్కసారి తక్కువ నవ్వినా టిక్కెట్ డబ్బులు వాపస్

చంద్రబాబు ఏం నేరం చేశారని జైల్లో పెట్టారు అని నటుడు మురళీమోహన్ ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తే చాలా బాధగా ఉందన్న ఆయన గ్రహణం పోయి త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని మురళీమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కనీస వసతులు లేకుండా చంద్రబాబును ఖైదీల మధ్య జైల్లో ఉంచారని ఆయన వాపోయారు. చంద్రబాబు అరెస్ట్ ను నిర్మాత అశ్వనీదత్ ఖండించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రసేనదే విజయం అని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇక మరో పక్క చంద్రసేన 160 సీట్లు సాధిస్తుందన్న అశ్వినీదత్ చంద్రసేన అంటే టీడీపీ ప్లస్ జనసేన అని చెప్పుకొచ్చారు. ఇక సినీ పరిశ్రమ నుంచి ఎవరూ రాలేదు ఏమీటీ? అని అడిగితే రాని వాళ్ల గురించి ఇప్పుడెందుకు? సినిమా ఇండస్ట్రీ అంటే నేను మురళీమోహన్ మాత్రమే అనుకుంటా అని అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version