NTV Telugu Site icon

Hidimba: ఓంకార్ తమ్ముడి ‘హిడింబ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Hidimba

Hidimba

Hidimba Movie Release date fixed: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడుగా రాజు గారి గది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ బాబు మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఆ తరువాత అశ్విన్ మరో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నా ఎందుకో కుదరడం లేదు. దీంతో ఈసారి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అశ్విన్ హీరోగా నందితా శ్వేత హీరోయిన్ గా నటిస్తున్న హిడింబ అనే సినిమా తెరకెక్కింది. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ సహా ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

Viraj Ashwin: విరాజ్ అశ్విన్‌ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్.. ఈసారి కొట్టేట్టు ఉన్నాడు!

ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. యాక్షన్ సీన్స్ కి సంబంధించిన పోస్టర్ లో అశ్విన్ బాబు పరిగెడుతూ కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రకారం 1908లో బంగాళాఖాతం సముద్ర తీరంలో కొంత మందిని బంధించి అక్కడ వదిలేసినట్లు చూపించారు. వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్యచేసే సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్స్ అయిన అశ్విన్, నందితా ప్రయత్నిస్తూ ఉండడం ఆ కేసులను ఎలా సాల్వ్ చేశారు అనేదే సినిమా కథగా చెబుతున్నారు. వికాస్ బడిశా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను గంగపట్నం శ్రీధర్ నిర్మించారు.

Show comments