Site icon NTV Telugu

Ashu Reddy : బ్రెయిన్ సర్జరీ వీడియో బయటపెట్టిన అషురెడ్డి..

Ashu

Ashu

Ashu Reddy : అషురెడ్డి ఎట్టకేలకు తన బ్రెయిన్ సర్జరీ వీడియోను బటయ పెట్టేసింది. ఆమె గతేడాది ఓ షోలో మాట్లాడుతూ.. తనకు బ్రెయిన్ సర్జరీ జరిగిందని.. సగం గుండు తీశారంటూ ఎమోషనల్ అయింది. బతుకుతానో లేదో అని భయపడ్డానని.. సగం హెయిర్ లేకుండానే ఆరు నెలలు గడిపినట్టు చెప్పింది. మొత్తం హెయిర్ తీసేసినా బాధ ఉండేది కాదంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో ఆమె షోలో చెప్పింది నిజమా కాదా అని చాలా మంది ఆరా తీశారు. ఎందుకంటే సర్జరీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో ఆమె బయట పెట్టలేదు. కానీ తాజాగా ఆమె ఆ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో డాక్టర్లు ఆమెకు కుట్లు వేస్తున్న ఫొటోను కూడా పంచుకుంది.
Read Also : Tollywood Biggies : అగ్ర దర్శకులతో అగ్ర తారలు.. అరుదైన ఫొటో..

ఆమెకు సగం హెయిర్ తీసేసి సర్జరీ చేస్తున్న వీడియోను.. ఆ తర్వాత ఆమె సగం గుండుతోనే తిరుగుతున్న ఫొటోలను కూడా ఈ వీడియోలు పంచుకుంది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. అప్పట్లో అషురెడ్డికి బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది. వెంటనే ఆమె అపోలో హాస్పిటల్ లో సర్జరీ చేయించుకుంది. సర్జరీ చేసేటప్పుడు నరాలు కొంచెం డ్యామేజ్ అయినా అంతే సంగతి అని డాక్టర్లు చెప్పారంట. చివరకు సక్సెస్ ఫుల్ గా సర్జరీని కంప్లీట్ చేశారు. సర్జరీ తర్వాత ఆరు నెలల పాటు ఇంటి వద్దనే రెస్ట్ తీసుకుని.. చివరకు కోలుకుని మామూలు మనిషిని అయ్యానని అషు అప్పట్లో వివరించింది. ప్రస్తుతం వరుస షోలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది.

Exit mobile version