NTV Telugu Site icon

Ashtadigbandhanam Trailer: అహంతో మొదలైన యుద్ధం అప్పుడే ముగుస్తుంది!

Ashtaddigbandhanam

Ashtaddigbandhanam

Ashtadigbandhanam Trailer Released: సూర్య భరత్ చంద్ర, విషిక కోట హీరో హీరోయిన్లుగా ఎమ్.కె.ఎ.కె.ఎ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మాతగా బాబా పి.ఆర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ” అష్టదిగ్బంధనం ” ఎ గేమ్ విత్ క్రైమ్ ” అనేది ట్యాగ్ లైన్ “. గతంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ ” శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ లాంచ్ చేసి టైటిల్ చాలా బాగుందని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు.

Mukesh Udeshi: సినీపరిశ్రమలో తీవ్ర విషాదం.. చిరంజీవి సినిమాల నిర్మాత మృతి!

ఇక ట్రైలర్ పరిశీలిస్తే యుద్ధం ఎప్పుడూ బలినే కోరుకుంటుంది, ఈ యుద్ధం రాజ్యం కోసమో, రాణి కోసమో, అధికారం కోసమో కాదు అహం కోసం అంటూ సాగిన నెరేషన్ డైలాగ్ ఇంట్రెస్ట్ రేకెత్తించింది. అహంతో మొదలైన యుద్ధం, ఆ అహం దేహాన్ని వీడినప్పుడే ముగుస్తుంది అని అంటూ ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ మొత్తం అనేక హింసాత్మక సీన్స్ తో పాటు, కొన్ని రొమాంటిక్ షాట్స్ కూడా కనిపించాయి. సినిమా మొత్తం అహంతో మొదలైన యుద్ధం, ఆ అహం దేహాన్ని వీడినప్పుడే ముగుస్తుంది అనే లైన్ మీదే సాగుతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది సినిమా యూనిట్. ఇక ట్రైలర్ లో మళయాలం బ్లాక్ బస్టర్ ” ట్రాన్స్ ” సినిమాకి సంగీతం అందించిన ” జాక్సన్ విజయన్ ” బీజీఎమ్ హైలైట్ గా ఉంది. సూర్య భరత్ చంద్ర, విషిక కోట హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.