టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’. విద్యా సాగర్ చింత దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ వీసీ డిజిటల్ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోలు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక తాజగా ఈ చిత్రంలోని మొదటి సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ ఆడపిల్ల నువ్వు అర్ధం కావా.. అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. 30 ఏళ్లు అయినా పెళ్లి కానీ అర్జున్ ప్రేమించిన అమ్మాయి ని అర్ధం చేసుకోవడానికి పడే కష్టాన్ని సాంగ్ రూపం లో చూపించారు.
ఇక ఈ వీడియోలో రుక్సార్, విశ్వక్ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది. ఈ పాత్ర కోసం విశ్వక్ కొద్దిగా బరువు పెరిగి.. పెద్ద మనిషిలా కనిపించాడు. ఇక అందమైన తెలుగింటి ఆడపడుచులా రుక్సార్ లుక్ అదిరిపోయింది. అనంత శ్రీరామ్ లిరిక్స్, జయకృష్ణ సంగీతం, అన్నింటికి మించి రామ్ మిర్యాల వాయిస్ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ సేన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
