Site icon NTV Telugu

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్‌లోకి మొన్నే హిట్టు కొట్టిన కుర్ర హీరోయిన్.. హాట్ నెస్ కోసమే బడా ప్లాన్?

Rithika Nayak To Enter Bigg Boss Telugu 7 House

Rithika Nayak To Enter Bigg Boss Telugu 7 House

Rithika Nayak to Enter Bigg Boss Telugu 7 House: బిగ్ బాస్ తెలుగు 7కి సర్వం సిద్ధం అయిపోయింది, ఇప్పటికే విజయవంతంగా 6 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సెవెన్ తెలుగు ఆదివారం నుంచి ప్రసారం కాబోతోంది. సెప్టెంబర్ మూడో తేదీన ఒక గ్రాండ్ కర్టెన్ రైజర్ ఎపిసోడ్ ద్వారా ఈ షో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనబోతున్న వారి లిస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. గతంలో లోపలికి ఎవరు వెళుతున్నారు అనే విషయాన్ని చాలా గోప్యంగా ఉంచేవారు. కానీ ఇప్పుడు ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో లింక్ అయిపోతోంది. తాజాగా బిగ్ బాస్ 7 సీజన్లోకి ఒక హాట్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి ఈ బిగ్ బాస్ సెవెన్ సీజన్లోకి కిరణ్ రాథోడ్ ఎంట్రీ ఇవ్వవచ్చని ప్రచారం జరిగింది, కానీ ఆమె హౌస్ లోకి రావడం లేదు.

Bigg Boss 7: రెమ్యునరేషన్ ఇష్యూ.. చివరి నిముషంలో టీంకి హ్యాండ్ ఇచ్చిన నటి?

ఆమె స్థానంలో షకీలాని హౌస్ లోకి పంపేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ బిగ్ బాస్ సీజన్ లో ఈ మధ్యనే ఒక మంచి హిట్ కొట్టిన హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె ఎవరో కాదు రితిక నాయక్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా ద్వారా ఆమె మంచి పాపులారిటీ సంపాదించింది. కనిపించిన మొదటి సినిమాతోనే ఆమె మంచి గుర్తింపు కూడా దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు తెలుగుతో పాటు తమిళ సినీ పరిశ్రమలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఆమెకు బిగ్ బాస్ టీం నుంచి ఆహ్వానం అందిందని, రెమ్యూనరేషన్ కూడా సెట్ కావడంతో ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగనుంది అనేది.

Exit mobile version