Site icon NTV Telugu

Ashoka Vanam Lo Arjuna Kalyanam : రిలీజ్ డేట్ ఫిక్స్

AVAK

Ashoka Vanam Lo Arjuna Kalyanam మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం Ashoka Vanam Lo Arjuna Kalyanam. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ నటిస్తోంది. సినిమా మొత్తం హీరోహీరోయిన్ల పెళ్లి చుట్టూనే తిరుగుతుంది. పెళ్ళిలో ఎదురైన అడ్డంకులను హీరో ఎలా ఎదుర్కొన్నాడో చూపించబోతున్నారు. వినోదం, భావోద్వేగాలతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 22న తెరపైకి రానుంది. ఈ సినిమాలో అర్జున్ కుమార్ అల్లంగా విశ్వక్ సేన్ నటిస్తుండగా, పసుపులేటి మాధవి పాత్రలో రుక్సార్ నటిస్తోంది.

Read Also : The Kashmir Files controversy : నిజాలు బయట పెట్టిన సీనియర్ నటుడు

విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్ ఈదర నిర్మించారు. బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పిస్తున్నారు. రవికిరణ్ కోలా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. Ashoka Vanam Lo Arjuna Kalyanam చిత్రానికి పవి కె పవన్ సినిమాటోగ్రఫీ, జై క్రిష్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తెలంగాణ యాసలో సాగనున్న ఈ సినిమాను వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version