NTV Telugu Site icon

Ashok Galla: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మహేష్ మేనల్లుడి సినిమా

Ashok Galla Joins Hands With Sithara

Ashok Galla Joins Hands With Sithara

Ashok Galla joins hands with Sithara Entertainments: మహేష్ బాబు మేనల్లుడు, హీరో సినిమాతో హీరోగా పరిచయమైన అశోక్ గల్లా తన తదుపరి సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో చేతులు కలిపారు. సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.27 గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఏప్రిల్ 5న అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈ తరం మెచ్చే అందమైన కథతో రాబోతుంది. ఈ సినిమా ప్రకటనకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌ ను బట్టి చూస్తే ఈ సినిమా కథ అమెరికాలో జరుగుతుందని అర్థమవుతోంది. “ది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ”తో కూడిన పోస్టర్ డిజైన్ ఆకట్టుకుంటోంది. “హ్యాపీ బర్త్‌డే అశోక్” అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసింది సినిమా యూనిట్. అలాగే ఇది నేటి తరం యువతకు సులభంగా చేరువయ్యే చిత్రంగా కనిపిస్తోందని అన్నారు.

Danam Nagender: 10 నిమిషాల్లో 45 వేల టికెట్లు ఎలా అమ్ముడు పోతాయి..?

‘ప్రేమమ్’, ‘భీష్మ’, ‘భీమ్లా నాయక్’, ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమాలను అందించే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అనతి కాలంలోనే తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. అలాంటి సితార సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో యువత మెచ్చే అంశాలతో పాటు కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా ఉంటుందని ఆశించవచ్చు. నిర్మాతలు ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు కానీ ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘లవర్‌’లో తన నటనతో విమర్శకుల మరియు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఉద్భవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు