NTV Telugu Site icon

Kalki 2898AD: అనుకున్న డేట్ కే కల్కి ఆగమనం… కొత్త పోస్టర్ హాలీవుడ్ రేంజులో ఉంది

Kalki 2898ad

Kalki 2898ad

ది మచ్ అవైటెడ్ కల్కి 2898AD రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు. సస్పెన్స్ ని రివీల్ చేస్తూ… కౌంట్ డౌన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ కల్కి 2898AD రిలీజ్ డేట్ ని వైజయంతి మూవీస్ ప్రకటించింది. బ్రాండ్ న్యూ పోస్టర్ తో హాలీవుడ్ స్టైల్ డిజైన్ తో కల్కి 2898 ఏ డేట్ కి ఆడియన్స్ ముందుకి వస్తుందో చెప్పేసారు. నిజానికి కల్కి సంక్రాంతి నుంచి వాయిదా పడినప్పుడే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో సినీ అభిమానులకి ఒక క్లారిటీ ఉంది. దాన్ని నిజం చేస్తూనే కల్కి 2898AD సినిమా 2024 మే 9న రిలీజ్ అవుతుందంటూ అనౌన్స్మెంట్ వచ్చేసింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక ఫ్యూచరిస్టిక్ పోస్టర్ లో ప్రభాస్ ని చూపిస్తూ, సూపర్ హీరో రేంజులో ప్రొజెక్ట్ చేస్తూ ఒక కొత్త పోస్టర్ ని డిజన్ చేసి… ఈ బ్రాండ్ న్యూ పోస్టర్ తో కల్కి రిలీజ్ డేట్ ని రివీల్ చేసిన విధానం ప్రభాస్ ఫాన్స్ ని ఖుషి చేస్తుంది. దీంతో కల్కి 2898 ఆన్ మే 9 అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

వైజయంతి మూవీస్ బ్యానర్ కి మే 9వ తేదికి దశాబ్దాల అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా తుఫానుకి కూడా ఎదురు నిలిచింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మోడరన్ క్లాసిక్ ‘మహానటి’ కూడా మే 9నే రిలీజ్ అయ్యింది. చివరగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో వైజయంతి మూవీ మే 9న హిట్ కొట్టింది. ఇప్పటివరకూ మే 9న వైజయంతి మూవీస్ నుంచి వచ్చి సినిమాలు నెవర్ బిఫోర్ హిట్స్ గా మారాయి. ఈ సెంటిమెంట్ ని బిలీవ్ చేస్తూ 2024 మే 9న కల్కిని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌ కీ రోల్ ప్లే చేస్తుండగా… దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. కల్కి 2898AD ఇండియాస్ నెక్స్ట్ బిగ్ థింగ్ లా కనిపిస్తోంది. ఇప్పటికే భారీ హైప్ ఉన్న కల్కి మూవీని రిలీజ్ టైమ్ కి వరల్డ్ వైడ్ బజ్ జనరేట్ చేయడం గ్యారెంటీ.

 

 

Show comments