Site icon NTV Telugu

ఆర్యన్ ఖాన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

Aryan-Khan

Aryan-Khan

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ముంబైలోని ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు రాగా… కోర్టు ఆర్యన్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆర్యన్‌తో పాటు సహ నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా బెయిల్ దరఖాస్తులను కూడా నిరాకరించారు జడ్జి.

Read Also : ‘కర్ణన్’ ఖాతాలో మరో అరుదైన అవార్డు

ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తును ముంబై నగర సివిల్, సెషన్స్ కోర్టు ఎన్‌డిపిఎస్ కోర్టు అదనపు సెషన్ జడ్జి వివి పాటిల్ ముందు సమర్పించారు. స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌డిపిఎస్) కోర్టు అక్టోబర్ 14 న ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ఆర్డర్ రిజర్వ్ చేసిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు తీర్పును ప్రకటించింది. ఆర్యన్ ఖాన్ న్యాయ బృందం ఇప్పుడు బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించనుంది.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) బృందం అక్టోబర్ 2 న గోవాకు వెళుతున్న క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ఒక బృందాన్ని అరెస్టు చేసింది. ఆర్యన్, ఇతర నిందితులపై ఎన్‌డిపిఎస్ చట్టం సెక్షన్ 8 (సి), 20 (బి), 27, 28, 29, 35 కింద కేసులు నమోదు చేశారు. ఆర్యన్, అర్బాజ్ ఆర్థర్ రోడ్ జైలులో ఉండగా, మున్మున్ ముంబైలోని బైకుల్లా మహిళా జైలులో ఉన్నారు.

Exit mobile version