బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు డైరెక్టర్‌గా రంగప్రవేశం చేస్తున్నారు. చాలా కాలంగా ఆయన దర్శకుడిగా డెబ్యూ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (Bads of Bollywood) అనే వెబ్ సిరీస్‌తో ఆర్యన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.
Also Read : Teja Sajja : స్టార్ డైరెక్టర్ చీట్ చేశాడు.. ఆ రోజులు మర్చిపోలేను
కిల్ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యువ హీరో లక్ష్య ఈ వెబ్ సిరీస్‌లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్‌లో రాజమౌళి, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్ వంటి సెలబ్రిటీలు అతిథి పాత్రలో సందడి చేశారు. అంతే కాకుండా షారుఖ్ ఖాన్ కూడా ఈ సిరీస్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనుండటంతో అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ట్రైలర్‌లో హాలీవుడ్ తరహా ప్రొడక్షన్ విలువలు, స్టైలిష్ ప్రెజెంటేషన్, బలమైన కంటెంట్ హింట్స్ కనబడుతున్నాయి. ముఖ్యంగా రాజమౌళి, ఆమిర్ ఖాన్ స్క్రీన్‌పై మెరుపులు చూపడం సినీ అభిమానులకు సర్ప్రైజ్‌గా మారింది. బాలీవుడ్‌లో ఇలాంటి ఎక్స్‌పెరిమెంటల్ వెబ్ సిరీస్ చాలా అరుదుగా వస్తాయి. అందుకే ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ పై ఆసక్తి మరింత పెరిగింది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నా ఈ సిరీస్ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. షారుఖ్ తనయుడి తొలి డైరెక్షన్ కావడం, టాప్ సెలబ్రిటీల స్పెషల్ అప్పియరెన్స్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్‌లోనే కాకుండా, పాన్ ఇండియా లెవెల్‌లోనూ హైప్ క్రియేట్ చేస్తోంది.
