ముంబై క్రూయీజ్ డ్రగ్స్ పార్టీ కేసులో… బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి చుక్కెదురైంది. అతని బెయిల్ పిటిషన్‌ను కోర్టు మూడో సారి తిరస్కరించింది. శుక్రవారం వరకు ఆర్యన్‌ను తమ కస్టడీలోనే ఉంచాలన్న ఎన్సీబీ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది న్యాయస్థానం. స్టేట్మెంట్ సమర్పించాలని ఆదేశించింది.డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారూఖ్ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు.. మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో అతను మరో మూడ్రోజులు జైల్లోనే ఉండనున్నాడు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో.. బుధవారం స్టేట్‌మెంట్ ఇచ్చాక ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై అదే రోజు విచారణ జరుగనుంది.
అయితే, శుక్రవారం వరకు ఆర్యన్‌ను తమ కస్టడీలోనే ఉంచాలన్న ఎన్సీబీ అభ్యర్థనను కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. బుధవారం ఉదయానికి స్టేట్‌మెంట్ సమర్పించాలని ఎన్సీబీని ఆదేశించారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగాలని ఆర్యన్ తరపు న్యాయవాది.. కోర్టును కోరారు. అతని వద్ద ఎలాంటి మాదక ద్రవ్యాలు లభించలేదు కాబట్టి.. ఇంతకాలం విచారణ అవసరం లేదని పేర్కొన్నారు. అయితే, రెండువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేశారు. ఆర్యన్ అరెస్టుపై రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. ఆర్యన్ ఖాన్‌కు మద్దతుగా ట్వీట్ చేసిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ.. బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అతని ఇంటిపేరు ఖాన్ అయినందుకే ఇలా వేధిస్తున్నారంటూ.. ఆరోపణలు గుప్పించారు. ఓ కేంద్ర మంత్రి కుమారుడు నలుగురు రైతులను హత్యచేసినా వదిలేశారనీ… కేవలం ఖాన్ అనే ఇంటిపేరు ఉన్న కారణంగా దర్యాప్తు సంస్థలన్నీ 23 ఏళ్ల కుర్రాడి వెంట పడుతున్నాయనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
