Site icon NTV Telugu

‘ATHARVA’ : ‘అథర్వ’ నుంచి అరవింద్ కృష్ణ బర్త్ డే పోస్టర్

Atharva

Atharva

Arvind Krishna: యంగ్ అండ్ టాలెంటెడ్‌ కార్తీక్ రాజు హీరోగా, సిమ్రన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అథర్వ’. మహేశ్ రెడ్డి దర్శకత్వంలో సుభాష్‌ నూతలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ మీద ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ‘అథర్వ’ చిత్రంలో ప్రముఖ నటుడు అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్రను పోషించారు. జనవరి 5 ,ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అరవింద్ కృష్ణ ఎంతో సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌లో పోలీసులు, మీడియా చేస్తున్న హడావుడి వాతావరణం కనిపిస్తోంది.

ఇప్పటి వరకు ‘అథర్వ’ సినిమా నుంచి కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్స్ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌లకు మంచి స్పందన లభించింది. దీంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది చిత్రయూనిట్. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా.. ఈ సినిమాలో ఇంకా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని, లవ్, రొమాన్స్, కామెడీ.. ఇలా అన్ని జానర్లను టచ్ చేసేలా సినిమా ఉంటుందని దర్శకుడు మహేశ్ రెడ్డి తెలిపారు. ”డీజే టిల్లు, మేజర్” సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్‌ పాకాల ‘అథర్వ’కు స్వరాలు సమకూర్చుతున్నారు. చరణ్‌ మాధవనేని కెమెరామెన్‌గా, ఎస్‌బి ఉద్దవ్ ఎడిటర్‌గా వ్యహరించారు. ఇందులో కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామరాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version