Arun Vijay: అరుణ్ విజయ్ ‘ఆక్రోశం’ ఎవరిపైన!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ వేగం పెంచాడు. ఈ యేడాది ఇప్పటికే అతను నటించిన ‘ఓ మై డాగ్’, ‘ఏనుగు’ చిత్రాలు వచ్చాయి. తాజాగా మరో సినిమా ‘సినం’ విడుదలకు సిద్ధం అవుతోంది. స్ట్రయిట్ తెలుగు సినిమాలు ‘బ్రూస్ లీ’, ‘సాహో’తో టాలీవుడ్ వ్యూవర్స్ కూ అరుణ్ విజయ్ చేరువయ్యాడు. దాంతో అతను నటించిన తమిళ చిత్రాలను తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు కూడా తమిళంలో రూపుదిద్దుకున్న ‘సినం’ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డబ్ చేస్తున్నారు. జి.యన్.ఆర్. కుమారవేలన్ దర్శకత్వంలో ఆర్. విజయ కుమార్ ఈ యాక్షన్ క్రైమ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను నిర్మించారు. హీరోయిన్ పల్లక్ లల్వాని ఇప్పటికే తెలుగులో ‘అబ్బాయితో అమ్మాయి, జువ్వా, క్రేజీ క్రేజీ ఫీలింగ్’ చిత్రాలలో నటించింది. ఇక అరుణ్ విజయ్ ‘ఆక్రోశం’ను తెలుగువారి ముందుకు సిహెచ్. సతీశ్ కుమార్, జగన్మోహిని తీసుకొస్తున్నారు. అనువాద కార్యక్రమాలు అన్ని పూర్తి అయిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఈ సందర్భంగా నిర్మాత సతీశ్ కుమార్ మాట్లాడుతూ, ”తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఎమోషనల్ చిత్రాలను బాగా ఇష్టపడతారు. మా బ్యానర్లో వచ్చిన ‘ఏనుగు’ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది. నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్‌గా తమిళ ‘సినం’ ట్రైలర్ ను చూసి ఆశ్చర్య పోయాను. వెంటనే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ‘నవరసాలను కలగలిపిన చిత్రాన్ని చూశామ’నే సంతృప్తి ఖచ్చితంగా పొందుతారని చెప్పగలను” అని అన్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!