Site icon NTV Telugu

Arun Vijay: అరుణ్‌ విజయ్ ‘ఆక్రోశం’ ఎవరిపైన!?

Akrosham

Akrosham

 

సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ వేగం పెంచాడు. ఈ యేడాది ఇప్పటికే అతను నటించిన ‘ఓ మై డాగ్’, ‘ఏనుగు’ చిత్రాలు వచ్చాయి. తాజాగా మరో సినిమా ‘సినం’ విడుదలకు సిద్ధం అవుతోంది. స్ట్రయిట్ తెలుగు సినిమాలు ‘బ్రూస్ లీ’, ‘సాహో’తో టాలీవుడ్ వ్యూవర్స్ కూ అరుణ్‌ విజయ్ చేరువయ్యాడు. దాంతో అతను నటించిన తమిళ చిత్రాలను తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు కూడా తమిళంలో రూపుదిద్దుకున్న ‘సినం’ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డబ్ చేస్తున్నారు. జి.యన్.ఆర్. కుమారవేలన్ దర్శకత్వంలో ఆర్‌. విజయ కుమార్ ఈ యాక్షన్ క్రైమ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను నిర్మించారు. హీరోయిన్ పల్లక్ లల్వాని ఇప్పటికే తెలుగులో ‘అబ్బాయితో అమ్మాయి, జువ్వా, క్రేజీ క్రేజీ ఫీలింగ్‌’ చిత్రాలలో నటించింది. ఇక అరుణ్ విజయ్ ‘ఆక్రోశం’ను తెలుగువారి ముందుకు సిహెచ్. సతీశ్ కుమార్, జగన్మోహిని తీసుకొస్తున్నారు. అనువాద కార్యక్రమాలు అన్ని పూర్తి అయిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత సతీశ్ కుమార్ మాట్లాడుతూ, ”తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఎమోషనల్ చిత్రాలను బాగా ఇష్టపడతారు. మా బ్యానర్‌లో వచ్చిన ‘ఏనుగు’ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది. నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్‌గా తమిళ ‘సినం’ ట్రైలర్ ను చూసి ఆశ్చర్య పోయాను. వెంటనే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ‘నవరసాలను కలగలిపిన చిత్రాన్ని చూశామ’నే సంతృప్తి ఖచ్చితంగా పొందుతారని చెప్పగలను” అని అన్నారు.

Exit mobile version