Site icon NTV Telugu

Surekha Vani: పవన్‌ కనిపిస్తే ముద్దుల వర్షమే.. సురేఖావాణి బోల్డ్ కామెంట్స్

Surekhavani

Surekhavani

Surekha Vani: ప్రముఖ సీనియర్ నటి సురేఖావాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా ఇలా గుర్తుండిపోయే పాత్రల్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు సురేఖావాణి. ఇటీవల కాస్త సినిమాల్లో జోరు తగ్గించినా సోషల్ మీడియాలో మాత్ర యాక్టివ్‌గా ఉంటూ కూతురు సుప్రితతో కలిసి తెగ రచ్చ చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే తనకు ఇష్టమైన హీరో ఎవరనే విషయాన్ని ఆమె ఇటీవల బయటపెట్టింది. అయితే తాజాగా సురేఖా వాణికి చెందిన ఓ పాట ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. అందులోనే తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. అందులో ఆమె మెగా కుటుంబంపై తనకున్న అభిమానాన్ని తెలిపింది. చిరంజీవికి తాను అభిమాని అని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది.

తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని.. అతడంటే ప్రాణం అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎదురుగా కనిపిస్తే వెంటనే 100 ముద్దులిస్తానంటూ.. హాట్ కామెంట్స్ చేసింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక అది తెలిసిన పవన్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. రెండో పెళ్లికి తాను దూరం అని చెప్పింది. కానీ బాయ్ ఫ్రెండ్ కావాలంటూ.. కొన్ని క్వాలిటీస్‌ను కూడా చెప్పింది.

Sukesh Chandrashekar Case: నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖా వాణి.. కూతురితో కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. కూతురు సుప్రితతో కలిసి జీవితాన్ని సరదాగా గడుపుతూ వాటికి సంబంధించిన పోస్టులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తామిద్దరివి హాట్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా వీడియోలు కూడా షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం సురేఖ భర్త మరణించిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు కూడా వాచ్చాయి. కానీ ఆమే మాత్రం ఇంతవరకు ఎవరిని రెండో వివాహం చేసుకోలేదు. కూతురు సుప్రితతోనే కలిసి సింగిల్‌గా జీవిస్తున్నారు. కూతురు కూడా తన తల్లిని పెళ్లి చేసుకోవాలని అడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.

Exit mobile version