Site icon NTV Telugu

Arohi Rao: స్ట్రాంగ్ కౌంటర్.. తమ్మీ, నువ్వు అడుక్కున్నా దొరకదు

Arohi Rao Counter

Arohi Rao Counter

Arohi Rao Gives Strong Counter To Netizen: కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఎలా హద్దుమీరి కామెంట్లు చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తమకు అడ్డు చెప్పడానికి ఎవరూ లేరని, ఎలా మాట్లాడినా చెల్లుతుందిలే అని అనుకొని.. నోటికొచ్చినట్టు వాగుతుంటారు. మరీ ముఖ్యంగా.. తమకేదో జన్మ హక్కు అన్నట్టుగా సెలెబ్రిటీల్ని ట్రోల్ చేయడం, అసభ్యకరమైన పదజాలంతో తిట్టడం చేస్తుంటారు. ఇలాంటి వాటిని సెలెబ్రిటీలు దాదాపు పట్టించుకోరు. కానీ, కొందరు మాత్రం సైలెంట్‌గా ఉండరు. తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ.. ఆయా నెటిజన్లకు బుద్ధి చెప్తుంటారు. ఇప్పుడు ఆరోహి రావు కూడా అదే పని చేసింది.

బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పార్టిసిపెంట్‌గా వెళ్లిన ఆరోహి రావు.. మొదట్లో కొంచెం జోష్ చూపించింది కానీ, ఆ తర్వాత ఆమె వేసిన ప్లాన్స్ బెడిసికొట్టాయి. దీంతో, ఆమె బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అప్పట్నుంచే ఈమెని నెటిజన్లు ట్రోల్ చేస్తూ వస్తున్నారు. బిగ్‌బాస్‌లో ఆర్జే సూర్యతో కలిసి తిరగడం తప్పితే, ప్రత్యేకంగా ఏం చేయలేదంటూ కామెంట్స్ చేస్తూ వచ్చారు. వీటిని ఆరోహి పెద్దగా పట్టించుకోలేదు కానీ, ఒక కామెంట్‌ని మాత్రం సీరియస్‌గా తీసుకుంది. ‘‘నీకు పొలం పనే కరెక్ట్.. బిగ్‌బాస్‌కి ఎందుకు వచ్చావ్? పో.. పోయి పొలం పని చేసుకో’’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. ఆరోహి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

‘‘తమ్మీ.. ఆ పొలాల్లో పని చేసేటోళ్లు లేకపోతే, నువ్వు అడుక్కు తిన్నా అన్నం దొరకదు’’ అంటూ ఆ నెటిజన్‌కి ఆరోహి సమాధానం ఇచ్చింది. అంటే.. పొలం పని చేసేటోళ్లను చిన్నచూపు చూడొద్దని, వారి వల్లే మనం కడుపు నింపుకుంటున్నామని పరోక్షంగా చెప్పిందన్నమాట! ఈ విధంగా ఆరోహి ఇచ్చిన రిప్లైకి ఫిదా అయి, నెటిజన్లు ఆమెని ప్రశంసిస్తున్నారు. అతనికి తగిన బుద్ధి చెప్పావంటూ కొనియాడుతున్నారు.

Exit mobile version