Site icon NTV Telugu

Sarkaru Vaari Paata : మహేష్ ఫ్యాన్స్ కు బాలీవుడ్ సింగర్ స్పెషల్ మెసేజ్

Armaan Malik

Armaan Malik

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ “సర్కారు వారి పాట” కోసం ఆయన అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ రెండు సాంగ్స్ ను విడుదల చేయగా, వాటికి మంచి స్పందన వచ్చింది. “సర్కారు వారి పాట” సంగీత దర్శకుడు తమన్ నెక్స్ట్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో ఊరిస్తూ ఉండడంతో మహేష్ అభిమానుల్లో ఉత్కంఠత నెలకొంది. అయితే మూడవ పాటను బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడాడు. దీంతో ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ మహేష్ ఫ్యాన్స్ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Read Also : Sanjay Dutt : డ్రగ్స్ అలవాటుకు కారణం అమ్మాయిలేనట !!

అర్మాన్ మాలిక్ ఇదే విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “నాకు సందేశం పంపే మహేష్ అభిమానులందరికీ చెబుతున్నాను. సర్కారు వారి పాటలోని పాట ఎప్పుడు విడుదల అవుతుందో నాకు నిజంగా తెలియదు. ఈ సాంగ్ ను వినడానికి మీరంతా ఎంత ఆతృతగా ఉన్నారో నేను కూడా అంతే ఎదురు చూస్తున్నా. కానీ ప్రతిదానికీ అంతర్గత ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన కోసం ఓపికగా వేచి ఉండటమే మనం చేయగలిగింది” అంటూ చెప్పుకొచ్చారు. ఇక అర్మాన్ మాలిక్ ఇంతకుముందు పాడిన “బుట్టబొమ్మ” సాంగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Exit mobile version