HIT-3 : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న హిట్-3 ప్రమోషన్ల జోరు పెంచేసింది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మే1న వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు పెంచేశారు. ఇప్పటికే నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి నడుమ వచ్చే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా నాని క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ.. అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అనే సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ తో పాటు ట్రైలర్ డేట్ ను కూడా ఇచ్చేశారు. ఈ సాంగ్ నాని క్యారెక్టర్ ను పరిచయం చేశారు. వేటు వేసినా.. గీత రాసినా.. కోత మారునా నేడే అంటూ సాగిన ఈ పాట.. ఫుల్ మాస్ యాంగిల్ లో సాగుతోంది. ఈ సాంగ్ లో నాని యాక్షన్ సీన్లు చూపించేస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా.. అనురాగ్ కులకర్ణి ఈ సాంగ్ పాడారు.
Read Also : Bihar: కేంద్ర మంత్రి మనవరాలిని కాల్చి చంపిన భర్త..
ఈ మూవీ ట్రైలర్ ను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు నాని పోలీస్ పాత్రలో నటించలేదు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన హిట్-1, 2 మంచి హిట్ కొట్టాయి. వాటికి నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు మూడో పార్టులో ఆయనే స్వయంగా నటిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్సిక్ సినిమాగా ఇది రాబోతోంది. ఇందులో సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు నాని. టీజర్ లోనే నాని పాత్ర ఎంత సీరియస్ గా ఉంటుందో చూపించారు. వరుస హత్యలను ఛేదించే కథ ఆధారంగా దీన్ని తీస్తున్నారు. ఈ మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని నాని చూస్తున్నాడు. ఈ మూవీతో పాటు ది ప్యారడైజ్ లో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన పాట క్షణాల్లోనే వైరల్ గా మారిపోయింది.