Site icon NTV Telugu

Bhagavanth kesari: ఏంది అనిల్ బ్రో.. ఇంత త్వరగా ముగించేస్తున్నావ్

Arjun Rampal Wraps Up Bhagavanth Kesari

Arjun Rampal Wraps Up Bhagavanth Kesari

Arjun Rampal wraps up Bhagavanth Kesari Shoot: వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ… అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా బాలకృష్ణ కుమార్తె పాత్రలో శ్రీలీల నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ నిజ జీవిత వయసున్న పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి. యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో హై యాక్షన్‌ ఉంటుంది. అనిల్ రావిపూడి మార్క్ మంచి వినోదం, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో అనేక మంది కీలక నటీనటులు నటిస్తున్నారు. భగవంత్ కేసరిలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

Varun tej- Lavanya: పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన ఆయన అప్పుడే సినిమా షూటింగ్ ముగించేశాడు. తాజాగా అర్జున్ రాంపాల్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ముగించినట్లుగా అధికారిక ప్రకటన రావడంతో ఇంత త్వరగా షూటింగ్ ముగించేస్తున్నారు ఏంటి అనిల్ బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరో పక్క ఈ సినిమాకి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా నందమూరి బాలకృష్ణ చూపిస్తానని ముందు నుంచి అనిల్ రావిపూడి చెబుతూ ఉండడంతో నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో సైతం సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. మరి అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకోబోతోంది అనేది వేసి చూడాల్సి ఉంది.

Exit mobile version