సినిమా ఒక గ్లామర్ ప్రపంచం ఇక్కడ ప్రతి ఒక్కరు అందంగానే ఉండాలి. హీరో, హీరోయిన్ అనే తేడా ఉండదు.. కొద్దిగా బక్క చిక్కినా, లేక కొద్దిగా బరువు పెరిగిన ట్రోలర్స్ ట్రోల్ చేయడానికి కాచుకు కూర్చుంటారు. సాధారణంగా హీరోయిన్ లనే బాడీ షేమింగ్ చేస్తారు అనుకోవడం లో నిజం లేదు.. హీరోలను కూడా బాడీ షేమింగ్ చేస్తుంటారు కొంతమంది ట్రోలర్స్.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ ఇలాంటి ట్రోల్స్ నే ఎదుర్కుంటున్నాడు. ఒకప్పుడు ఎంతో నాజూకుగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న అర్జున్ ప్రస్తుతం కొద్దిగా బరువు పెరిగి కనిపిస్తున్నాడు. అయితే ఎప్పటికప్పుడు జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ మునుపటి రూపం కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఇక నిత్యం తన వర్కవుట్స్ వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు.
తాజాగా ఆ వర్కవుట్స్ వీడియోస్ పై కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అర్జున్ ఫిట్‌నెస్ ట్రైనర్ డ్రూ నీల్‌ను ట్యాగ్ చేస్తూ ” ఇలాంటి క్లయింట్‌ను పొందడం మీ అదృష్టం.. నిత్యం డబ్బులు వస్తూనే ఉంటాయి కానీ అతడు మాత్రం ఎప్పటికి షేప్ పొందలేడు.. అతను మనస్తత్వం లేని ధనవంతుడు బ్రో” అని రాసుకొచ్చాడు. ఇక ఈ కామెంట్ పై అర్జున్ స్పందించాడు. “అయితే మీ దృష్టిలో షేప్ అంటే బాడీ మీద కట్స్ కనిపించాలి.. అంతేనా.. క్రమశిక్షణతో ఆరోగ్యకరమైన భోజనం చేయడం, చిరునవ్వుతో కూడిన సామర్థ్యాన్ని పెంచడం కూడా ఒక సెషన్ కౌంటే.. మనమందరం మీకు డీపీలో కనిపించే ఫోటోలా ఉండాలి. కానీ ఫిట్ నెస్ అంటే దానికోసమే చేస్తుంటారు అనుకొనే నీ మనస్తత్వానికి విచారిస్తున్నాను. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు విమర్శించినా నేను ఎదుర్కొంటాను.. ముఖాముఖిగా సమాధానం ఇవ్వగలను.. నా ముఖాన్ని చూపించకుండా తప్పుకొని తిరగలేను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ పై అర్జున్ ప్రియురాలు హాట్ బ్యూటీ మలైకా అరోరా ఫైర్ అయ్యింది.. సూపర్ అర్జున్.. చక్కగా చెప్పావ్.. ఇలాంటి విమర్శలను నీరసంగా ప్రకాశింపజేయనివ్వవద్దు.. ఈ ప్రయాణంలో నీకు మరింత శక్తి, దైర్యం రావాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.
