Site icon NTV Telugu

Arjun Kapoor: మలైకాతో పెళ్లికి రెడీగా లేనంటూ షాకింగ్ కామెంట్స్

Arjun Malaika Marriage

Arjun Malaika Marriage

Arjun Kapoor On Marriage With Malaika Arora: బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న విషయం అందరికీ తెలిసిందే! మొదట్లో తమ ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్‌గా నడిపిన ఈ జంట.. ఆ తర్వాత ఓపెన్ అయ్యింది. ఈమధ్య కాలంలో అయితే వీళ్లు తెగ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పెడుతున్నారు. అసలు తమలాంటి మరొకటి ఉండదన్నట్టుగా.. తెగ హడావుడి చేస్తున్నారు. ఈ హంగామా చూసే, వీళ్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న రూమర్లు పుట్టుకొచ్చేశాయి. బాలీవుడ్ ప్రేమజంటలు ఈమధ్య పెళ్లి బంధంతో ఒక్కటవుతున్న నేపథ్యంలో.. ఈ జంట కూడా పెళ్లికి సిద్ధమవుతోందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

అయితే.. ఈ వార్తలపై తాజాగా అర్జున్ కపూర్ ఆసక్తికరమైన రీతిలో స్పందించాడు. ‘కాఫీ విత్‌ కరణ్‌ షో’కి గెస్ట్‌గా వచ్చిన అర్జున్‌.. మలైకాతో పెళ్లి చేసుకునేందుకు తానిప్పుడే సిద్ధంగా లేనని బాబ్ పేల్చాడు. కొవిడ్ లాక్డౌన్ కారణంగా రెండేళ్లు సినిమాలు లేక ఖాళీగా సమయం గడపాల్సి వచ్చిందని, ఇప్పుడు తాను తన కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నానని వివరించాడు. తన పని తనకు సంతోషాన్ని కలిగిస్తుందని, తాను సంతోషంగానే ఉన్నప్పుడే భాగస్వామిని సంతోష పెట్టగలనని అన్నాడు. ప్రస్తుతానికైతే తనకు పెళ్లి ఆలోచనలు లేవని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి, అర్జున్ చేసిన కామెంట్స్‌పై మలైకా అరోరా ఎలా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version