Arjun Kalyan Missed Baby Movie offer: ఈమధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది బేబీ సినిమా. ఈ సినిమాలో తనకు మరెక్ట్ లేకపోవడం వలన ఛాన్స్ మిస్ అయిందని నటుడు అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. నిజానికి అర్జున్ కళ్యాణ్ కొన్ని సీరియల్స్ చేసి ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 6తో ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ శ్రీసత్యను పిచ్చిగా ప్రేమించినట్టు కనిపించడంతో త్వరలోనే ఎలిమినేట్ చేసి పంపినా గతం కంటే బెటర్ గా ప్రేక్షకుల్లో అయితే రిజిస్టర్ అయ్యాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమా ఛాన్స్ లు దక్కించుకుంటున్న ఆయన బేబీ మూవీలో ఛాన్స్ మిస్ అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. బేబీ ప్రాజెక్ట్ లో అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఆ ఒక్కటి లేకపోవడం వలన అవకాశం దక్కలేదని చెప్పుకొచ్చాడు. నేరుగా బేబీ మూవీ అని చెప్పలేదు కానీ ఆ పేరు చెప్పకుండా పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
సిల్కు చీరలో చిన్నది..సెగలు పుట్టిస్తోంది
తాజాగా అర్జున్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవల ఓ కల్ట్ క్లాసిక్ విడుదలై మంచి విజయం సాధించిందని, ఈ ప్రాజెక్ట్ లో సెకండ్ హీరోగా నేను నటించాల్సిందని చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలో హీరోయిన్ నా ఫ్రెండ్ కావడంతో నా పేరు రిఫర్ చేసింది ఆ దర్శకుడు కూడా ఫ్రెండే దీంతో నాకు ఛాన్స్ ఖాయం అనుకున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఇది నాలుగు కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం మార్కెట్ ఉన్న హీరో కావాలి అని చెప్పి వేరే హీరోని అనుకుంటున్నాం అన్నాడని వెల్లడించాడు. ఆ మాట విని నిరాశకు గురయ్యానని పేర్కొన్న అర్జున్ మార్కెట్ లేకుండా గుర్తింపు రాదు ఆ గుర్తింపు కోసమే బిగ్ బాస్ షోకి వెళ్ళాను కానీ అవకాశాలు ఇవ్వకుండా మార్కెట్ ఎలా క్రియేట్ అవుతుందని ఆయన ప్రశ్నించాడు. ఇక సినిమాల్లో నటిస్తేనే కదా జనాల్లో గుర్తింపు వచ్చేది అది రాకుండా మార్కెట్ ఎలా క్రియేట్ అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశాడు.
