Arjun Chakravarthy: మరో బయోపిక్ వచ్చేస్తోంది.. గెట్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arjun Chakravarthy – Journey of an Unsung Champion first look out now: ఇప్పటికే స్పోర్ట్స్ పర్సన్స్ గురించి అనేక బయోపిక్ సినిమాలు రాగా ఇప్పుడు మరో స్పోర్ట్స్ పర్సన్ గురించి బయోపిక్ రానుంది. “అర్జున్ చక్రవర్తి, జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్” పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీని గుబ్బల నిర్మాత కాగా విజయ రామరాజు, సిజా రోజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్, దయానంద్ రెడ్డి, అజయ్ ఘోష్, దుర్గేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా 1980లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఇది ఒక క్రీడాకారుడు జీవితంలో కష్టాలను, విజయాలు సహజంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ సాగే సినిమా అని అంటున్నారు.
OnePlus Foldable: వన్ ప్లస్ ఓపెన్ ఫోన్ కొనాలంటే ఇదే మంచి ఛాన్స్… ఏకంగా 11 వేలు డిస్కౌంట్.. ఎలా అంటే?
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
తాజాగా ఈ సినిమా నుంచి విజయ రామరాజు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్‌లో అర్జున్ చక్రవర్తి స్టేడియం మధ్యలో చేతిలో పతకంతో, ముఖంలో అనుకున్నది సాధించానన్న గర్వంతో కనిపిస్తున్నారు. “భారత కబడ్డీపై అర్జున్ చక్రవర్తి ప్రభావం, 1980లలో భారత క్రికెట్‌పై కపిల్ దేవ్ ప్రభావం స్థాయిలో ఉంటుంది” అంటూ రాసిన అక్షరాలు సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ సినిమా కోసం అత్యున్నత సాంకేతిక బృందం పని చేస్తోంది, విఘ్నేష్ బాస్కరన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి జగదీష్ చీకాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుమిత్ పటేల్ ఆర్ట్ డైరెక్షన్, ప్రదీప్ నందన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ అర్జున్ చక్రవర్తి తెలుగు -తమిళ భాషల్లో ఏకకాలంలో షూట్ చేయబడింది. హిందీ, మలయాళం, కన్నడ భాషలలో డబ్ చేయబడి, పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?