Arjun Birthday Special :యాక్షన్ తో దడదడలాడించిన అర్జున్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arjun Birthday Special : పోరాట సన్నివేశాల్లో తనదైన బాణీ పలికిస్తూ ‘యాక్షన్ కింగ్’ అనిపించుకున్నారు అర్జున్ సర్జా. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా సాగుతున్న అర్జున్ స్వాతంత్ర్య దినోత్సవాన జన్మించడం వల్ల తనలో దేశభక్తిని నింపుకొనీ చిత్రాలను రూపొందించారు. ఆయన చేతిపై మన మువ్వన్నెల జెండా పచ్చబొట్టు కూడా కనిపిస్తుంది. తెలుగునాట సైతం అర్జున్ జయకేతనం ఎగురవేశారు. అనేక చిత్రాలలో డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో భళా అనిపించిన అర్జున్ ‘యాక్షన్ కింగ్’ గా నిలచిపోయారు.
అర్జున్ సర్జా అసలు పేరు శ్రీనివాస సర్జా. 1962 ఆగస్టు 15న అర్జున్ జన్మించారు. ఆయన తండ్రి కన్నడ చిత్రసీమలో కేరెక్టర్ యాక్టర్ గా ఎంతో పేరున్న శక్తి ప్రసాద్. ఆయన అసలు పేరు జె.సి.రామస్వామి. స్వతహాగా ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేయడంతో తన తనయులు కిశోర్ సర్జా, అర్జున్ సర్జా ఇద్దరినీ యాక్షన్ హీరోలుగా తీర్చిదిద్దారు. ఈ ఇద్దరు తండ్రి పేరు నిలుపుతూ యాక్షన్ సీన్స్ లో నటించేవారు. కిశోర్ సర్జా డైరెక్టర్ గా కూడా రాణించారు. అర్జున్ యాక్షన్ సీన్స్ చూసిన కోడి రామకృష్ణ, నిర్మాత ఎస్ .గోపాల్ రెడ్డి తమ ‘మా పల్లెలో గోపాలుడు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం మూడు థియేటర్లలో స్వర్ణోత్సవం జరుపుకుంది. దాంతో తెలుగు చిత్రసీమలోనూ అర్జున్ కు అవకాశాలు మొదలయ్యాయి. “టెర్రర్, బంగారు చిలక, నాగదేవత, ప్రతిధ్వని, కోటిగాడు, కోనసీమ కుర్రోడు, త్రిమూర్తులు, మొనగాడు” వంటి చిత్రాలతో తెలుగువారిని అలరించారు. తరువాత తెలుగులో ఫ్లాపులు పలకరించగానే, తమిళ చిత్రాలపై దృష్టిని కేంద్రీకరించారు అర్జున్. దర్శకుడు బి.గోపాల్ తొలి చిత్రం ‘ప్రతిధ్వని’లో కథానాయకునిగా నటించిన అర్జున్, తమిళ దర్శకుడు శంకర్ మొదటి సినిమా ‘జెంటిల్ మేన్’లోనూ హీరోగా అలరించారు. అలా కొందరు దర్శకులకు ఈ యాక్షన్ కింగ్ సెంటిమెంట్ గా మారారు. అర్జున్ భార్య నివేదిత కూడా నటి. ఆయన కూతురు ఐశ్వర్య కూడా కన్నవారి బాటలో పయనిస్తూ నటనను ఎంచుకుంది.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
తెలుగులో కొంత గ్యాప్ తరువాత అర్జున్ తనకు తొలి ఘనవిజయం చూపించిన కోడి రామకృష్ణ ‘పుట్టింటికి రా చెల్లి’చిత్రంలో నటించారు . ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. అంతకు ముందు “ద్రోహి, శుభవార్త, శ్రీమంజునాథ” వంటి ద్విభాషా చిత్రాల్లోనూ అభినయించారు. జగపతిబాబుతో కలసి ‘హనుమాన్ జంక్షన్’లో నటించారు అర్జున్. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత నుంచీ అర్జున్, జగపతిబాబు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. “శ్రీఆంజనేయం, రామ రామ కృష్ణ కృష్ణ, లై, నా పేరు సూర్య”వంటి చిత్రాల్లోనూ అర్జున్ ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించారు. రవితేజ హీరోగా రూపొందిన ‘ఖిలాడీ’లోనూ అర్జున్ ఓ ముఖ్య పాత్ర ధరించారు. ఇలా తెలుగువారితో తన అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నారు అర్జున్.
తాజావార్తలు
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..