బిగ్ బాస్ ఫేమ్ అర్చన టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘అవలంబిక’. సుజయ్, మంజూష పొలగాని ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను రాజశేఖర్ దర్శకత్వంలో జి. శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు. సోషియో ఫాంటసీ హారర్ చిత్రంగా దర్శకుడు దీనిని మలిచాడని, అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన ఈ సినిమాను ఇదే నెల 20న విడుదల చేయబోతున్నామని నిర్మాత శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇటీవల నాగబాబు మూవీ ట్రైలర్ ను విడుదల చేశారని, దానికి మంచి స్పందన వచ్చిందని ఆయన అన్నారు. ఇందులోని ఐదు పాటలను ఆదిత్య మ్యూజిక్ సంస్థ విడుదల చేసింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సినిమాను అనుకున్న విధంగా తీయగలిగామని, ఈ చిత్రంలో ఉత్కంఠకు గురిచేసే ఐదు పోరాట సన్నివేశాలు కూడా ఉన్నాయని నిర్మాత చెప్పారు. కృష్ణ చైతన్య, లావణ్య, వై.వి. రావు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఉదయ్ కిరణ్ సంగీతం అందించారు.
‘అవలంబిక’గా అందాల అర్చన!
