AR Rahman: నిన్న రెహమాన్.. నేడు సైరా భాను!

  • హాట్ టాపిక్ అవుతున్న రెహమాన్ విడాకులు
  • నిన్న లీగల్ నోటీసులు పంపిన రెహమాన్
  • నేడు రెహమాన్ భార్య సంచలన వ్యాఖ్యలు
Ar Rahman

Ar Rahman

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, ఆయన సతీమణి సైరా భాను సుమారు మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించగా రెహమాన్‌ను తప్పుబడుతూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై సైరా భాను స్పందించారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ముంబయిలో ఉన్నా< గత కొన్ని నెలలుగా నా ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఆయనకు దూరంగా ఉండాలనుకున్నా. యూట్యూబ్‌, తమిళ మీడియాను ఒక్కటే కోరుతున్నా, దయచేసి ఆయన గురించి ఎలాంటి చెడు ప్రచారం చేయవద్దు. ఆయన చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి, ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. సైరా ఎక్కడికి వెళ్లిందని అందరూ మాట్లాడుకుంటున్నారు కదా ట్రీట్‌మెంట్‌ కోసం ముంబయి వచ్చానని ఆమె అన్నారు. ఆయన అంటే నాకెంతో ఇష్టం. Divvala Madhuri: పోలీస్ స్టేషన్‌కు దివ్వెల మాధురి.. జనసేన నాయకులపై ఫిర్యాదు

ఆయనకు కూడా నేనంటే ఇష్టం. ఆయనపై విమర్శలు చేయడం ఇకనైనా మానండి, మేము ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. కాబట్టి ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని. త్వరలోనే నేను చెన్నై వస్తా’’ అని ఆమె పేర్కొన్నారు. ఆయన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దు అని ఆమె కోరారు. ఇక ఏఆర్ రెహమాన్ విడాకుల గురించి తప్పుగా మాట్లాడుతున్న వారిపై సైరా భాను లాయర్ వందనా షా కూడా ఘాటుగా స్పందించారు. నిజానికి AR రెహమాన్ విడాకుల అనంతరం ఆయన వద్ద పని చేసే నుండి బాస్ గిటారిస్ట్ మోహిని డే తన భర్త మార్క్ నుండి విడిపోతున్నట్లు Instagram లో పోస్ట్ చేసింది. మోహిని ఇన్‌స్టా పోస్ట్‌ని చూసి, కొందరు ఆమెతో ఏఆర్ రెహమాన్ అఫైర్ పెట్టుకున్నాడని కూడా కామెంట్స్ చేశారు. ఇదే విషయం మీద ఆమె స్పందించారు.

×
×
Ad