Site icon NTV Telugu

Grammys 2022 : తనయుడితో ఏఆర్ రెహ్మాన్ సెల్ఫీ… పిక్ వైరల్

Ar Rahman

Ar Rahman

గ్రామీ అవార్డులు 2022 వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం ఈ వేడుక లాస్ వెగాస్‌లోని MGM గ్రాండ్ గార్డెన్ అరేనాలో జరిగింది. సినీ పరిశ్రమలోని ప్రముఖులు అత్యంత ఆకర్షణీయమైన అవతార్‌లలో రెడ్ కార్పెట్‌ పై కన్పించారు. ఈ సంవత్సరం కూడా ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆసియా నుంచి ఈ వేడుకలకు హాజరైన ప్రముఖ సంగీత దిగ్గజాలలో ఏఆర్ రెహమాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ తన కుమారుడితో ఉన్న సెల్ఫీని పంచుకున్నారు.

Read Also : Anasuya : మగజాతి పరువు తీస్తున్నారు… నెటిజన్ పై యాంకర్ ఫైర్

అకాడమీ అవార్డు గెలుచుకున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మొదటిసారిగా ఈ ఈవెంట్ కు తన కొడుకును కూడా తీసుకువచ్చాడు. కొడుకు అమీన్‌తో సెల్ఫీ దిగి, దానికి “గ్రామీస్” అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక వర్ధమాన గాయకుడు అయిన ఏఆర్ అమీన్ తన తండ్రితో కలిసి రెడ్ కార్పెట్ మీద కూడా కనిపించాడు. ఏఆర్ రెహమాన్ రెడ్ కార్పెట్ పై ఉన్న ఒక ఫోటోను పంచుకున్న అమీన్ దానికి “పేరెంటింగ్” అని క్యాప్షన్ ఇచ్చారు. వీరిద్దరూ వేడుకల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక గ్రామీ అవార్డుల వేదికపై BTS, సిల్క్ సోనిక్, జస్టిన్ బీబర్, లేడీ గాగా, జోన్ బాటిస్ట్, బిల్లీ ఎలిష్, జాన్ లెజెండ్, క్యారీ అండర్‌వుడ్, లిల్ నాస్ X, J బాల్విన్, ఒలివియా రోడ్రిగో వంటి ప్రతిభావంతులైన సంగీతకారులు ప్రదర్శన ఇచ్చారు.

Exit mobile version