ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ కూడా కొత్త షెడ్యూల్ మొదలైంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అదలా ఉంచితే రామ్ చరణ్ 16వ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదేమిటంటే రామ్ చరణ్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
Breaking: హాస్పిటల్‌లో చేరిన బండ్ల గణేష్.. చేతికి సెలైన్?
ఈ సినిమా కథను బుచ్చిబాబు రెహమాన్ కి నెరేట్ చేయగా సినిమాకి మ్యూజిక్ అందించేందుకు రెహమాన్ ముందుకు వచ్చినట్లు ప్రచారం జరగగా తాజాగా, ఈ విషయంపై రహమాన్ స్పందించాడు. రామ్‍చరణ్ 16 సినిమాకు తాను సంగీతం అందిచనున్నట్టు ఏఆర్ రహమాన్ తాజాగా తెలుగు మీడియాతో ముచ్చటిస్తూ చెప్పాడు. నాయకుడు సినిమా ప్రమోషన్‍లలో భాగంగా ఈ విషయాన్ని రహమాన్ ఆఫ్ ది రికార్డుగా వెల్లడించాడు. ”రామ్‍చరణ్ సినిమాకు పని చేస్తున్నా,ఆ ప్రాజెక్ట్ పట్ల ఉత్సాహంగా ఉన్నా, చాలా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్” అని రహమాన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని రామ్‍చరణ్ 16 యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా కోసం రెహమాన్ ని సంగీత దర్శకుడుగా తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.