NTV Telugu Site icon

AR Rahman: పూణేలో రెహమాన్ కి పోలీసుల షాక్… షో ఆపేసి…

Rahman

Rahman

ఆస్కార్ అవార్డ్ విన్నర్, ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ ని పూణేలో చేదు అనుభవం ఎదురయ్యింది. పూణేలోని రాజా బహదూర్ మిల్ ప్రాంతంలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్ లో రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా పోలీసులు వచ్చి, షో ఆపేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తమిళ ప్రజలు రెహమాన్ కి అవమానం జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెహమాన్ ఫాన్స్ కూడా ట్వీట్స్ చేస్తుండడంతో సోషల్ మీడియాలో ఈ టాపిక్ రచ్చ రచ్చ అయ్యింది.

Read Also: Rajini: రజినీ ట్రెండ్ వెనక ఉన్నాడు… కారణాలు మాత్రం రెండే…

ఈ గొడవ పెరుగుతూ ఉండడంతో పూణే పోలీస్ డిసిపి జోన్ 2, స్మార్తన పాటిల్ మాట్లాడుతూ… “రెహమాన్ తన చివరి పాట పాడుతున్నాడు. పాడే సమయంలో అప్పటికే రాత్రి 10 గంటలు దాటిందని అతనికి తెలియలేదు కాబట్టి వేదిక వద్ద ఉన్న మా పోలీసు అధికారి వెళ్లి అతనికి తెలియజేశాడు. SC మార్గదర్శకాల ప్రకారం అనుసరించాల్సిన గడువు సమయం ముగుసిపోవడంతో రెహమాన్ విషయాన్ని అర్ధం చేసుకోని ఆ తర్వాత పాడటం ఆపేసాడు. ఇంతకుమించి కాన్సర్ట్ లో ఎలాంటి ఇష్యూ జరగలేద”ని స్పందించారు. రెహమాన్ కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు ఎందుకంటే కాన్సర్ట్ అయిపోగానే “పూణే! మీ అందరితో మళ్ళీ పాడటానికి నేను త్వరలో తిరిగి వస్తాను!” అంటూ కొన్ని ఫోటోస్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

 

Show comments