ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఎ. ఆర్. రెహమాన్ ఇప్పుడు సినిమా రంగంతో పూర్తి స్థాయిలో మమేకం అయిపోయాడు. ఇటీవల ’99 సాంగ్స్’ అనే పాన్ ఇండియా మూవీని నిర్మించి, విడదల చేసిన రెహమాన్, తాజాగా వర్చువల్ రియాలిటీ మూవీ ‘లే మాస్క్’ను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను ప్రస్తుతం జరుగుతున్న కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. 75 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని అక్కడి వ్యూవర్స్ కోసం 36 నిమిషాలకు కుదించారు. రెహమాన్ భార్య సైరా ఇచ్చిన ఐడియాలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. 2016లో ప్రారంభమైన ఈ చిత్రం కరోనా కారణంగా ఆలస్యమైంది. అంతర్జాతీయ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ, అత్యుత్తమ సాంకేతిక విలువలతో రెహమాన్ తెరకెక్కించాడు. అయితే… ఈ సినిమా తర్వాత తాను ‘కన్ఫెషన్స్’ పేరుతో మరో చిత్రం తెరకెక్కించబోతున్నట్టు రెహమాన్ వెల్లడించాడు. ఈ సినిమా ‘లే మాస్క్’ తరహాలో ఎక్కువ సమయం తీసుకోదని, ఇప్పుడు అందివచ్చిన సాంకేతికతో త్వరగానే పూర్తి చేస్తానని, ఇప్పటికే 60 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని రెహమాన్ తెలిపాడు. మొత్తం మీద సంగీత దర్శకత్వంతో పాటు చిత్ర నిర్మాణం, దర్శకత్వంపైనా రెహమాన్ తనదైన ముద్రను వేయడానికి గట్టిగానే కృషి చేస్తున్నాడు.
AR Rehman: రెండో సినిమా డైరెక్షన్ కూ సిద్ధమౌతున్న ఆస్కార్ విన్నర్!

Rahamanjpg