Apsara Rani’s Racharikam pooja ceremony : చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈశ్వర్ నిర్మిస్తున్న ‘రాచరికం’ సినిమాలో విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు మేకర్స్. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా.. నిర్మాత డీఎస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత ఈశ్వర్ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రానికి వెంగి సంగీతాన్ని అందించగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరా మెన్ గా పని చేయనున్నారు. దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ ‘చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ మీద రాచరికం అనే సినిమాను తీస్తున్నామని, ఈ మూవీ గ్లింప్స్ ప్రస్తుతం మంచి రెస్సాన్స్ దక్కించుకుందని అన్నారు.
RGV: పవన్ కళ్యాణ్ బిగ్ స్టార్.. నాకు అంత కెపాసిటీ లేదు
హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచీ పాజిటివ్ వైబ్స్ వచ్చాయని, మా టైటిల్ చూసి బోయపాటి శ్రీను పర్సనల్‌గా మెసెజ్ పెట్టారని అన్నారు. గత ఏడు నెలలుగా దర్శక నిర్మాతలు ఈ మూవీ మీదే ఫోకస్ పెట్టారని, అప్సర ఆర్జీవీ సినిమాతో ఫేమస్ అయ్యారని ఇందులో ఆమె చాలా కొత్తగా కనిపిస్తారని అన్నారు. అప్సరా రాణి మాట్లాడుతూ.. ‘చిల్ బ్రోస్ సంస్థ నన్ను ఈ పాత్ర కోసం అప్రోచ్ అయింది, కథ విన్నప్పుడే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నమ్మా, ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అంటూ రాచరికంతో అరాచకం సృష్టించబోతున్నామ’ని అన్నారు. ఈ చిత్రంలో విజయ్ శంకర్, అప్సరా రాణి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు.
