Site icon NTV Telugu

Aparna Cinemas: హైదరాబాదుకు మరో మల్టీఫ్లెక్స్ వచ్చేసింది.. సీటుకే ఛార్జర్, బటన్ నొక్కితే ఫుడ్ ఆర్డర్!

Aparna Cinemas

Aparna Cinemas

Aparna Cinemas Launched Officially : కన్స్ట్రక్షన్ సంస్థ అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. ప్రేక్షకులు లార్జర్ దెన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేలా మోడరన్ టెక్నాలజీ, అద్భుతమైన యాంబియన్స్, వరల్డ్ క్లాస్ ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్, సిట్టింగ్, లగ్జరీ సదుపాయలతో అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్ ని నల్లగండ్లలో గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ లో అపర్ణ సినిమాస్ లోగోని లాంచ్ చేశారు. ఈ మాల్ లో కొత్త స్పెషాలిటీ అండర్ గ్రౌండ్ లో రెండు కార్లు ఒకేసారి వెళ్ళొచ్చు, రావచ్చు. ది బెస్ట్ సౌండ్ సిస్టమ్ సిట్టింగ్ ప్రొజెక్షన్ ఉందని, సినిమాతో పాటు ఫుడ్ కూడా రిజినబుల్ ధరల్లోనే ఉంటుందని చెడుతున్నారు. మే 31 నుంచి అందరికీ ఈ మాల్ అందుబాటులోకి రానుంది. అపర్ణ సినిమాస్ లో మొత్తం ఏడు స్క్రీన్స్ వున్నాయి.

Kalki 2898 AD: షాకింగ్ : రిలీజ్ కు ముందే ఓటీటీలోకి భైరవ?

మొత్తం కెపాసిటీ 1208. ఇందులో 135 గోల్డ్ క్లాస్ సీట్స్ కి ఎంట్రీ సెపరేట్ గా ఉంటుంది. అందులో వేరే మల్టీ ఫ్లెక్స్ లో లేని ఫీచర్స్ వుంటాయి. ఛార్జింగ్ ఫెసిలిటీతో పాటు ఫుడ్ స్పెషాలిటీ కూడా ఉంటుంది. బటన్ నొక్కితే వచ్చి మా సొంత కిచెన్లో వండిన ఫుడ్ సర్వ్ చేస్తారు అని వెల్లడించారు. అపర్ణ సినిమాస్ లో బార్కో సిరిస్ 4 ప్రొజెక్టర్ ఉందని, ఇది వరల్డ్ లో అడ్వాన్స్ లేజర్ ప్రొజెక్టర్ అని వెల్లడించారు. క్యాలిటీకి రాజీపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని గొప్ప ప్రోజెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐదు స్క్రీన్స్ లో డాల్బీ అట్మాస్, రెండు స్క్రీన్స్ లో 7. 1 ఛానల్ సౌండ్ ఇన్స్టాల్ చేశారు. థియేటర్ లో ఏ కార్నర్ నుంచి సినిమా చూసిన సరే ప్రేక్షకులని లీనం చేసేలా సౌండ్, ప్రోజెక్షన్ వుంటుందన్నారు. అంతేకాక లెగ్ స్పేస్ కూడా మిగిలిన మల్టీప్లెక్స్ లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది.

Exit mobile version