Site icon NTV Telugu

RRR : టికెట్ రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

rrr

AP Govt grants Ticket Hike for RRR : దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ RRR ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా పెద్దల రిక్వెస్ట్ మేరకు ఏపీలో కొత్త జీవో విడుదలైనప్పటికీ అక్కడ 20 శాతం షూటింగ్ జరుపుకున్న చిత్రాలకు మాత్రమే టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని కన్పించింది ప్రభుత్వం. దీంతో కొత్త జీవోపై “రాధేశ్యామ్” పెట్టుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి. నిజానికి కొత్త జీవోతో టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం వస్తుందని టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురు చూసింది. ఇక ఆ జీవో బెనిఫిట్ పొందే మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం “రాధేశ్యామ్” అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అనుకున్నట్టుగా జరగలేదు. ఇక ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” మూవీ వంతు వచ్చింది. ఇదే టికెట్ రేట్లతో సినిమాను విడుదల చేస్తే భారీ నష్టాలూ చవిచూడక తప్పదు. దానికి నిదర్శనం “రాధేశ్యామ్”.

Read Also : Brahmastra : అలియా బర్త్ డే ట్రీట్… ఇషాను పరిచయం చేసిన టీం

దీంతో రాజమౌళి, డీవీవీ దానయ్య సోమవారం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఏపీ ముఖ్యమంత్రితో టికెట్ ధరల విషయమై చర్చించారు. అయితే రాజమౌళి ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం “ఆర్‌ఆర్‌ఆర్‌” టిక్కెట్‌ ధరలను 100 రూపాయల పెంపునకు అనుమంతించింది. ఈ కొత్త ధరలు RRR కలెక్షన్‌లకు సహాయపడతాయనడంలో ఎలాంటి సందేశం లేదు. ఇక అక్కడ టికెట్ రేట్ల విషయంలో ఈ బెనిఫిట్ అందుకుంటున్న మొదటి తెలుగు సినిమా “RRR”. ఇక బెనిఫిట్ షోలకు కూడా ఏపీలో సపోర్ట్ లభించింది. ఎగ్జిబిటర్లు పెద్ద సినిమాలను రోజుకు ఐదు షోలు ప్రదర్శించవచ్చని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. పెద్ద సినిమా, చిన్న సినిమా ఒకేరోజు విడుదలైతే ఎగ్జిబిటర్లు కనీసం రోజుకు ఒక్కసారైనా చిన్న సినిమాలను ప్రదర్శించాలని అన్నారు.

400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన “RRR” భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ టీతో తెరకెక్కిన చిత్రాలలో ఒకటి. ఆంద్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ సినిమా ఎక్కువ ధరలకు అమ్ముడుపోయింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్, సముద్రకని RRRలో భాగమయ్యారన్న విషయం తెలిసిందే. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version