NTV Telugu Site icon

Guntur Kaaram: ‘గుంటూరు కారం’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Guntur Kaaram

Guntur Kaaram

AP Goverment gives 50 Rupees Hike for Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఇక రిలీజ్ కి అంతా సిద్ధం అయిపోయింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ షోల కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. అంతేకాదు ఈ సినిమాకి రోజుకి ఆరు షోలు వేసుకునేలా పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి వారం రోజుల పాటు ఉదయం నాలుగు గంటల నుంచి మొత్తం ఆరు షోలు వేసుకునే అవకాసహం కల్పించారు. ఇక దానితో పాటు సినిమా టికెట్ రేట్లు కూడా పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ మీద 65 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 చొప్పున పెంచుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. అంతేకాక గుంటూరు కారం సినిమా రిలీజ్ రోజున ఒంటిగంటకు షోలు వేసుకోవచ్చని ప్రకటించారు.

Varalaxmi: నేను ప్లాన్ చేసినట్లు ఏదీ జరగలేదు.. కాపాడుకోవడానికి ప్రయత్నిస్తా: వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇంటర్వ్యూ

తాజాగా ఏపీ ప్రభుత్వం గుంటూరు కారం టికెట్ ధరని రూ. 50 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 12 నుంచి 21 వరకు టికెట్ల రేట్‌ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అధికారికంగా జీవో కూడా విడుదల చేసింది. ఇక ఇటీవల విడుదలైన ప్రభాస్ సలార్ చిత్రం కంటే ఇది ఎక్కువ మొత్తం. సలార్ చిత్రానికి 40 రూపాయలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.