Site icon NTV Telugu

Maruva Tarama: ‘మరువ తరమా’ టీజర్, ట్రైలర్ చాలా నచ్చాయి.. ఏపీ డిప్యూటీ స్పీకర్!

Maruva Tarama Ap Deputy Speaker

Maruva Tarama Ap Deputy Speaker

కొత్త డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మరువ తరమా’. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్‌కుమార్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో హరిష్ ధనుంజయ హీరోగా నటించగా.. అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా కథానాయికలుగా నటించారు. ఈ మూవీ నవంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు, హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఏపీ డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. మరువ తరమా మంచి విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

‘డైరెక్టర్ చైతన్య వర్మ నాకు తెలుసు. ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నానని చైతన్య చెప్పినప్పుడు ఆలోచించుకోమని ఒకటికి రెండుసార్లు చెప్పా. చైతన్య తనమీద తనకున్న నమ్మకంతో ధైర్యంగా అడుగేశారు. మరోసారి కలిసినప్పుడు సినిమా స్టార్ చేశానని చెప్పారు. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. సమయం ఉన్నపుడు మూవీస్ చూస్తాను. రోహిణి గారు అప్పటికీ ఇప్పటికీ అలానే ఉన్నారు. మరువ తరమా టీజర్, ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చాయి. విజువల్స్ అద్భుతంగా అనిపించాయి. డీఓపీ సూపర్. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా కథ ఉంది. ఇద్దరమ్మాయిలతో హీరో కాస్త కంగారుపడుతున్నాడు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నారా రోహిత్, శ్రీ విష్ణు స్నేహబంధానికి ప్రతీక. వారిద్దరూ మంచి మిత్రులు. వారిద్దరూ ఈ కార్యక్రమానికి రావడం ఆనందం. ఈ సినిమా ప్రజలందరి అభిమానాన్ని చూరగొంటుందని నమ్ముతున్నా. ఇది జనం మెచ్చే సినిమా అవుతుంది. చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’ అని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు అన్నారు.

Also Read: Google Pixel 8a Offers: ఆఫర్లు బాబోయ్ ఆఫర్లు.. 53 వేల గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్ 7 వేలకే!

డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లి మాట్లాడుతూ… ‘మరువ తరమా కోసం వచ్చిన రఘు గారికి, నారా రోహిత్ గారికి, శ్రీ విష్ణు గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో మాకు ఎన్ని సవాళ్లు, సమస్యలు వచ్చినా.. వాటన్నంటినీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చాం. సినిమా పూర్తవడం నాకు పెద్ద విజయం. ఈ జర్నీలో నేను ఎంతో నేర్చుకున్నాను. కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయం. ఈ మూవీని చూసి నేను సంతృప్తి చెందాను. ఈ సినిమాను మీడియానే జనాల వరకు తీసుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. నా వంతు ప్రయత్నం చేశా.. ఈ మూవీ ఫలితాన్ని మీడియా, ఆడియెన్స్‌కే వదిలేస్తున్నాను. అందరూ మా సినిమాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పారు.

 

Exit mobile version