NTV Telugu Site icon

RAM : RAPO 22 టీమ్ కు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి స్పెషల్ విషెష్

Rapo22

Rapo22

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రామ్ కెరీర్ లో 22వ సినిమాగా రానుంది. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ‘మీకు సుపరిచితుడు… మీలో ఒకడు… మీ సాగర్’ అనే క్యారక్టర్ లో రామ్ నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ సినిమనునిర్మిస్తున్నారు.

Also Read : Sarangapani Jathakam : సారంగపాణి జాతకం సమ్మర్ లో తెలుస్తుంది

కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో జరుగుగుతుంది. ఈ సందర్భంగా రామ్ పోతినేనికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. గోదావరి జిల్లాలలో సంప్రదాయం ప్రతిబింబించేలా అరటి పళ్ళతో చేసిన భారీ దండతో వెల్కమ్ చెప్పారు. కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామంలో జరుగుతున్నRAPO 22 షూటింగ్ కు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేసారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామంలో మైత్రీ మూవీస్ ప్రొడక్షన్లో జరుగుతున్నషూటింగ్ కి విచ్చేసిన స్టార్ హీరో శ్రీ రామ్ పోతినేనిని మరియు డైరెక్టర్ పి.మహేష్ బాబు ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కాసేపు ముచ్చటించాను. గోదావరి జిల్లాలలో తీసే సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయి. ఈ సినిమా రామ్ కు మంచి విజయాన్ని అందజేస్తుంది అని ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేసారు. 

అందుకు బదులుగా ‘మిమ్మల్ని మా సెట్‌లో కలవడం గౌరవంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి కోసం మీ ఆలోచనలు, మీ విజన్ కు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రాజమండ్రి నాకెంతో స్పెషల్. మా షూటింగ్ కు అన్ని విధాలా సహకరించిన మీకు, స్థానిక అధికారుల సహకారానికి ధన్యవాదాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు మీ మద్దతు అభినందనీయం’ అని ఎక్స్ లో ట్వీట్ చేసాడు రామ్