Site icon NTV Telugu

Anushka : సొంత ప్రొడక్షన్ హౌజ్ నుండి తప్పుకున్న బ్యూటీ

Anushka

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘క్లీన్ స్లేట్ ఫిలింజ్’ని అక్టోబర్ 2013లో స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థలో NH10, ఫిల్లౌరీ, పారి, పాతాల్ లోక్, బుల్బుల్ వంటి అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. అయితే ఇప్పుడు అనుష్క క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ నుండి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన సుదీర్ఘ హృదయపూర్వక నోట్‌లో అనుష్క తన నిర్ణయాన్ని ప్రకటించింది.

Read Also : Bigg Boss Non Stop : మూడవ వారం ఎలిమినేషన్… ఆర్జే అవుట్

“ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ @kans26 @officialcsfilms! నా శుభాకాంక్ష‌లు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి!” అంటూ రాసుకొచ్చింది అనుష్క. “నేను నా సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి క్లీన్ స్లేట్ ఫిలింజ్‌ని ప్రారంభించినప్పుడు, ప్రొడక్షన్ విషయానికి వస్తే మేము కొత్తవాళ్లమే… కానీ మేము భారతదేశంలో ఎంటర్టైన్మెంట్ ఎజెండాను ప్రయత్నించాలని అనుకున్నాము. ఈ రోజు నేను ఇప్పటివరకు జరిగిన మా ప్రయాణాన్ని తిరిగి చూసుకున్నప్పుడు, మేము సృష్టించి, సాధించగలిగిన దాని గురించి చాలా గర్వపడుతున్నాను. కమర్షియల్ ప్రాజెక్ట్‌లు ఎలా ఉండాలి అనే కథనాన్ని మార్చాలనే నా దృష్టితో CSF ప్రారంభించినప్పటికీ, ఈ రోజు CSFను ఇలా మలచడంలో అద్భుతంగా పని చేసిన కర్నేష్‌కి ఈ ఘనత లభిస్తుంది” అని రాసుకొచ్చింది. “నా లైఫ్ ను నటనకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను! అందువల్ల అత్యంత సమర్ధుడైన వ్యక్తి కర్నేష్‌ మొదట రూపొందించిన విజన్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడనే నమ్మకంతో నేను CSF నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నేను CSF కోసం చీర్‌లీడర్‌గా కొనసాగుతాను. CSF కుటుంబానికి నా శుభాకాంక్షలు. మీ అందరినీ ప్రేమిస్తున్నాను” అని అనుష్క ముగించింది.

Exit mobile version