NTV Telugu Site icon

Anushka Shetty: మెగాస్టార్ సరసన స్వీటీ.. ఈ వయస్సులో ఆ సాహసం అవసరమా..?

Chiru

Chiru

Anushka Shetty: భోళా శంకర్ సినిమాతో చిరంజీవి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చిరు గట్టిగా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి చేతిలో మరో రెండు సినిమాలు లాక్ అయి ఉన్నాయి. ఈ సినిమాల్లో మెగా 157 పైనే అందరి చూపు ఉంది. బింబిసార లాంటి పీరియాడిక్ డ్రామాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే చిరు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో పంచభూతాలను చూపించి సినిమాపై అంచనాలను పెంచేశాడు వశిష్ఠ. కేవలం కథతోనే కాకుండా కాస్టింగ్ తో కూడా వశిష్ట అభిమానులు సర్ప్రైజ్ చేయనున్నాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించనున్నదని తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ లో తప్ప స్వీటీ మరే ప్రొడక్షన్ హౌస్ లో నటించదు అని అందరికీ తెల్సిందే. ఈ మధ్యనే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Meena Sagar: భర్త చనిపోయి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే రెండో పెళ్లి అంటున్నారు.. సిగ్గు లేదు.. ?

ఇక అదే యూవీ క్రియేషన్స్ నుంచి వస్తున్న మెగా 157 లో కూడా స్వీటీనే హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ భావించారట. కథ నచ్చడంతో ఆమె కూడా ఓకే చేసిందని సమాచారం. ఇప్పటివరకు చిరు, అనుష్క కాంబో తెరపైన కనిపించింది లేదు. అప్పుడెప్పుడో స్టాలిన్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో వీరిద్దరూ జంటగా కనిపించారు. ఇన్నేళ్ల తర్వాత ఈ కాంబో జంటగా మరోసారి కనుముందు చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది. ఇక సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గే పనిలో ఉన్నారట. ఈ సినిమా కోసం యంగ్ లుక్ కావాలని వశిష్ట చెప్పడంతో చిరు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ వయస్సులో చిరు బరువు తగ్గడం అవసరమా.? అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments