NTV Telugu Site icon

Anushka Shetty: ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సింది స్వీటీ..

Anushka

Anushka

Anushka Shetty: ఒక సినిమా కోసం నటీనటులు ఎంత కష్టపడతారో చాలామందికి తెలియదు. కొన్నిసార్లు ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. గుండు చేయించుకోవడం, బరువు తగ్గడం, బరువు పెరగడం.. ఇలా చేసినప్పుడు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ను కూడా ఫేస్ చేస్తారు. వీటివలన వారి జీవితాలే మారిపోవచ్చు. అలాంటి ఒక నిర్ణయం వలన అనుష్క శెట్టి జీవితమే మారిపోయింది. సూపర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ అనుష్క శెట్టి. యోగా టీచర్ అయిన అనుష్క.. తన ఫిజిక్ తో కుర్రకారును తన కొంగుకు కట్టేసుకుంది. బిల్లాలో బికినీ వేసినా.. అరుంధతితో భయపెట్టినా కూడా అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు. ఇక సినిమా కోసం ఏదైనా చేసే అనుష్క.. సైజ్ జీరో కోసం బరువు పెరగుతాను అని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు అందం మనసు మాత్రమే అని, బరువు కాదని ఒక ప్రయోగాత్మకమైన సినిమాగా సైజ్ జీరో తెరకెక్కింది. ఇక ఈ సినిమా కోసం స్వీటీ బరువు పెరగాలి.

ఇకపొతే ముందు డైరెక్టర్.. సీజీలో స్వీటీని బరువు పెరిగినట్లు చూపిద్దామని అనుకున్నారట. కానీ, నేచురల్ గా ఉండదని స్వీటీనే బరువు పెరుగుతానని చెప్పిందట. అందుకోసం ఆమె బాగా తిని బరువు పెరిగింది. ఇక సినిమాలో కనిపించినట్లు స్వీటీ అంత లావుగా మారిపోయింది. ఇక సినిమా రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. దీంతో స్వీటీ పడిన కష్టమంతా వృధా అయ్యింది. అది పక్కన పెడితే అప్పటినుంచి స్వీటీ ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. ఎంత తగ్గాలి అని ప్రయత్నించినా కూడా అనుష్క తగ్గలేకపోయింది. ఇప్పటికీ ఆమె బొద్దుగానే ఉంది. దీనివలన అనుష్క ఎన్నో ట్రోల్స్ కు గురవుతుంది. తాజాగా అనుష్క వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. వైట్ అండ్ వైట్ డ్రెస్, ముఖానికి మాస్క్ పెట్టుకొని ఆమె కారులో నుంచి దిగుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్వీటీని అలా చూసిన అభిమానులు.. సైజ్ జీరో కోసం బరువు పెరగకుండా ఉండాల్సింది స్వీటీ.. అది చేసి తప్పు చేసావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనుష్క.. కన్నడలో ఒక మూవీ చేస్తోంది.