క్వీన్ ఆఫ్ హార్ట్స్ అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘త్రిషా కృష్ణన్’ తమిళనాట ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తుంది. 2022లో ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన త్రిష, ఈ ఇయర్ ని గ్రాండ్ గా ఎండ్ చెయ్యడానికి మరో సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తోంది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాంగి’, ఆన్ లైన్ ఛానెల్ రిపోర్టర్ ‘తాయల్ నాయగి ‘ పాత్రలో త్రిష కనిపించనుంది. టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన ‘ఏఆర్ మురుగదాస్’ రాసిన కథతో రూపొందిన ‘రాంగి’ సినిమాని శరవణన్ తెరకెక్కించాడు. థ్రిల్లర్ జనార్ ఇష్టపడే ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న ‘రాంగి’ సినిమా డిసెంబర్ 30న విడుదల కానుంది. చాలా రోజుల తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న త్రిష, ‘రాంగి’ మూవీ కోసం ప్రమోషన్స్ ని అగ్రెసివ్ గా చేస్తోంది.
Read Also: Ponniyin Selvan: రేపే ఊహించని అప్డేట్…
ఈ ప్రమోషన్స్ లో భాగంగా త్రిష ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అని ఇంటర్వ్యూవర్ క్వేషన్ అడగడంతో త్రిష ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘అనుష్క శెట్టి’ పేరు చెప్పేసింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న త్రిష, తన ఫేవరేట్ హీరోయిన్ విషయంలో ఎలాంటి ఇగో లేకుండా అనుష్క పేరు చెప్పడంతో అనుష్క ఫాన్స్ ‘రాంగి’ మూవీకి సపోర్ట్ చేస్తున్నారు. తెలుగులో ‘రాంగి’ సినిమా రిలీజ్ అవ్వట్లేదు కానీ మలయాళ భాషలోకి మాత్రం డబ్ అవుతోంది. 2016లో వచ్చిన ‘నాయకీ’ అనే సినిమా తర్వాత త్రిష తెలుగులో నటించలేదు. అంతకన్నా ముందు 2015లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘లయన్’ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపించింది. ఇదే త్రిష చివరగా నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా.
Read Also: Trisha: డీ-ఏజింగ్ టెక్నాలజీ కూడా ఇంత అందం ఇవ్వలేదు…