Site icon NTV Telugu

Anushka Shetty: 17 ఏళ్లు.. ఆశ్చర్యంగా ఉందంటూ ఎమోషనల్ అయిన స్వీటీ

Anushka

Anushka

Anushka Shetty:అనుష్క శెట్టి.. సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్. అందం, అభినయం కలబోసిన రూపం అనుష్క సొంతం. పాత్ర ఏదైనా స్వీటీ ఆ పాత్రకే వన్నె తెచ్చిపెడుతోంది. స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంప్పించినా బ్యూటీ స్టార్ హీరోలకు ధీటుగా లేడి ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా మారింది. అరుంధతి, భాగమతి, బాహుబలి లాంటి చిత్రాలు అనుష్కకు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. ఇక నిన్నటితో అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ 17 ఏళ్ల జర్నీలో ఎన్నో విజయాలను అందుకొంది. ఎన్నో పరాజయాలను చవిచూసింది. మరెన్నో విమర్శలను ఎదుర్కొంది.. అయినా అన్నింటిని దాటుకొని ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. స్వీటీ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. అయినా ఆమెపై అభిమానులకు ఉన్న మక్కువ మాత్రం తగ్గలేదు. ఇక తాజాగా అనుష్క యూవీ క్రియేషన్ లో ఒక సినిమా చేస్తోంది. నవీన్ పోలిశెట్టి సరసన అనుష్క నటిస్తోంది. ఈ సెట్ లో ఆమె 17 ఏళ్ల జర్నీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఇక ఆ ఫోటోలను షేర్ చేస్తూ అనుష్క అభిమానులకు థాంక్స్ చెప్పుకొచ్చింది. “17 సంవత్సరాలుగా నాకు అండగా నిలిచి, మద్దతు తెలుపుతున్న చిత్ర పరిశ్రమ, కుటుంబం, అభిమానులకు నా ధన్యవాదాలు. మీ షరతులేని ప్రేమకు నేను ఎప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాను. అలంటి షరతులు లేని ప్రేమను నాకు అందిస్తున్నందుకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక సెట్ లో అనుష్క కేక్ కట్ చేసిన ఫోటోలను షేర్ చేసింది. అయితే అందులో వారి ముఖాలు కనిపించకపోయేసరికి అభిమానులున కొద్దిగా అసహనం వ్యక్తం చేసినా అనుష్క 17 ఏళ్ల జర్నీ విజయవంతంగా పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె మరిన్ని సినిమాలు చేయాలనీ కోరుకొంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Anushka Latest Tweet:

Exit mobile version