Site icon NTV Telugu

Anushka Shetty: అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు అనుష్క.. ‘సీతారామం’ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Prabhas

Prabhas

Anushka Shetty: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక చాలా రోజుల తరువాత ఆమె, నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకు సంబంధించిన అప్డేట్ ను త్వరలో ఇవ్వనున్నారు. ఇక సినిమాల గురించి పక్కన పెడితే స్వీటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉంటుంది. టాలీవుడ్ లో ఏదైనా మంచి సినిమా వస్తే ఆ సినిమాను వీక్షించి దాని గురించి అభిమానులతో పంచుకొంటూ ఉంటుంది. తాజాగా సీతారామం సినిమా చూసిన స్వీటీ తన రివ్యూ చెప్పుకొచ్చింది.

“సీతారామం.. ఒక అందమైన చిత్రం.. మిమ్మల్ని సున్నితంగా కౌగిలించుకొని సీతారాముల ప్రయాణంలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. సీతా, రామ్, అఫ్రీన్.. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. ప్రతి ఒక్క క్రాఫ్ట్.. హృదయాన్ని హత్తుకొంటుంది. మరెన్నో హృదయాన్ని కదిలించే కథ రావాలని కోరుకొంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన ప్రభాస్ కూడా సీతారామం పై ప్రశంసల వర్షం కురిపించాడు. కొన్ని సినిమాలను థియేటర్లో మాత్రమే చూడాలని, అలాంటి సినిమా సీతారామం అని చెప్పుకొచ్చాడు. అద్భుతమైన లవ్ స్టోరీని చిత్ర బృందం తెరకెక్కించిందని, ప్రతి ఒక్కరు ఈ సినిమాకు ఫిదా అవుతారని చెప్పుకొచ్చాడు. ఇక అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు అనుష్క.. ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version