NTV Telugu Site icon

Ghaati : అనుష్క ‘ఘాటీ’ వాయిదా తప్పేలా లేదు

Anushkashetty

Anushkashetty

టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైపు హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ స్టేటస్ ను అందుకుని అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. ‘బాహుబలి’ సక్సెస్ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తుంది అనుష్క. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ చేస్తూ వచ్చింది. అశోక్ డైరెక్షన్ లో వచ్చిన భాగమతి సూపర్ హిట్ గా నిలిచింది. కానీ నిశ్శబ్దం సినిమాతో ఫ్లాప్ చూసింది. ఇక యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో హీరోయిన్ గా హిట్ అందుకుంది.

Also Read : Alia Bhatt : డేర్ చేస్తున్న అలియా భట్.. తేడా వస్తే అంతే

ఇప్పుడు మరల కాస్త గ్యాప్ ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్‌గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. కానీ ఇప్పడు ఆ టైమ్ కు ఘాటీ రాదని టాలీవుడ్ లో వినిపిస్తోంది. షూట్ డిలే కారణంగా కీలకమైన సీన్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉందని వాయిదా పడక తప్పదని సమాచారం. అదే టైమ్ లో మరో రెండు సినిమాలు ఆ డేట్ ను లాక్ చేసుకునే పనిలో ఉన్నాయి.