టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామస్టార్ హీరోలందరి సరసన నటించడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారి టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. అరుంధతి, బాహుబలి, బాహుబలి 2, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాలతో స్వీటీ స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. ఇక ఈ మధ్యన కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మ త్వరలోనే కుర్ర హీరో నవీన్ పోలిశెట్టితో జతకట్టనుంది. ఇక అనుష్క గురించి పక్కన పెడితే ప్రస్తుతం అనుష్క అన్న గుణరంజన్‌శెట్టి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వార్తలు గుప్పుమంటున్నాయి. గుణరంజన్‌శెట్టి.. ఒకప్పటి కర్ణాటక గ్యాంగ్ స్టర్ ముత్తప్పరై కు కుడిభుజంగా ఉండేవాడు.. ముత్తప్పరై మృతిచెందాకా అతడికి ఎడమ భుజంగా ఉన్న మన్విత్ రాయ్, గుణరంజన్‌శెట్టి ల మధ్య విబేధాలు తలెత్తాయి.
ముత్తప్పరై స్థాపించిన జయ కర్ణాటక సంఘం నుంచి గుణరంజన్ బయటకు వచ్చి జయకర్ణాటక జనపర వేదికను స్థాపించి మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. ఇక అది తట్టుకోలేని మన్విత్, గుణరంజన్‌శెట్టి ని హత్య చేయడానికి కుట్రలు చేస్తున్నాడని, తన మనుషులు గుణరంజన్‌శెట్టి ని సీక్రెట్ గా ఫాలో చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే గుణరంజన్‌శెట్టి ఇటీవల కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రని కలిసి తనకు భద్రత ఏర్పాటు చేయవలసిందిగా కోరారు.. మన్విత్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని, తనకు భద్రత కల్పించామని వినతి పత్రాన్ని అందజేశాడు. ఇక గుణరంజన్ ఆరోపణలను మన్విత్ కొట్టిపారేశాడు.. అతడిపై హత్య ప్రయత్నం చేసే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పుకొచ్చాడు.