Site icon NTV Telugu

వామిక వైరల్ పిక్ పై విరుష్క రియాక్షన్

vamika

స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కుమార్తె వామికా విషయంలో గోప్యతను పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ హాఫ్ సెంచరీ చేసి సంబరాలు చేసుకుంటున్న సమయంలో స్టేడియంలోని కెమెరాలు వామిక ముఖాన్ని బయట పెట్టాయి. విరాట్ హాఫ్ సెంచరీ చేయడంతో అతని వైపు చూపించాడు. ఆ తర్వాత కెమెరామెన్ కెమెరాను వామిక వైపు చాలాసేపు ఫోకస్ చేశాడు. దీంతో ఆ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు నెటిజన్లు. ఆ వెంటనే సోషల్ మీడియాలో వామిక పిక్స్ వైరల్‌గా మారాయి.

Read Also : హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ బటర్ ఫ్లై కిస్… రొమాంటిక్ వీడియో

ఇప్పుడు అనుష్క సోషల్ మీడియాలో స్పందిస్తూ ఫోటోను మళ్లీ వైరల్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ చేసింది. అందులో తన కుమార్తె వైరల్ పిక్ విషయాన్ని ప్రస్తావించింది. “హలో ఫ్రెండ్స్… నిన్నటి మ్యాచ్‌లో స్టేడియం నుండి నా ఫోటో షేర్ చేయబడిందని నేను గ్రహించాను. ఈ చిత్రాలు మాకు తెలియకుండానే బయటకి వచ్చాయని అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. నా స్టాండ్, అప్పీల్ మునుపటిలాగే ఉన్నాయి. వామిక చిత్రాన్ని క్లిక్ చేయకపోయినా లేదా షేర్ చేయకపోయినా మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. దీని వెనుక ఉన్న కారణాన్ని మేము ఇప్పటికే చెప్పాము… ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. కుమార్తె ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో అనుష్క, విరాట్ ఇద్దరూ ఇప్పుడు వామికా గోప్యతపై తమ వైఖరిని గౌరవించాలని ప్రజలను కోరుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. వామికా చిత్రాలను ప్రచురించవద్దని దంపతులు సోమవారం మీడియాను అభ్యర్థించారు.

Exit mobile version