Site icon NTV Telugu

Anupama Parameswaran: పవన్ ను చూడడానికి బుర్కా వేసుకొని మరీ వెళ్లిందట..

Anupama

Anupama

సాధారణంగా ఒక స్టార్ స్టేటస్ వచ్చాకా బయట తిరగడం కుదరదు. అది ఎవ్వరైనా సరే .. అభిమానులు చుట్టూ ఉంటూ ఆటోగ్రాఫ్ లు ఫోటోగ్రాఫ్ లు అంటూ వెంటపడుతూ ఉంటారు. అందుకే సెలబ్రిటీలు ఎవరు తెలియని ప్లేస్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది తారలు మాత్రం కొద్దిగా రిస్క్ చేసి అయినా తాము చేయాల్సింది చేసేస్తారు.. ప్రస్తుతం కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అదే చేసింది.. ఇటీవల హీరోయిన్ సాయి పల్లవి సినిమా చూడడానికి ముఖం మొత్తం కప్పుకొని ఒక సాధారణ యువతి లా వచ్చి సినిమా చూసి వెళ్ళిపోయిన సంగతి తెల్సిందే.. ఇక అనుపమ కొద్దిగా డిఫరెంట్ గా బుర్కా వేసుకొని మరీ వెళ్లి సినిమా చూసిందంట.. అనుపమ అంత రిస్క్ చేసి చూడడానికి ఆ సినిమా హీరో ఎవరు అంటే.. ఇంకెవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

ఇటీవల పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా చూడడం కోసం బుర్కా వేసుకొని వెళ్లిందట.. ఈ విషయానన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పవన్ సర్ అంటే నాకెంతో ఇష్టం. ఆయన సినిమాలు చూస్తుంటాను. హైదరాబాద్ సుదర్శన్ లో తెల్లవారు జాము 7 గంటల షో కి వెళ్లి సీక్రెట్ గా ‘భీమ్లా నాయక్’ సినిమా చూశాను. ‘బటర్‌ఫ్లై’ హీరో నిహాల్‌తో కలిసి మొదటి రోజు ఫస్ట్‌ షో చూశా. థియేటర్‌కు వచ్చిన వాళ్లెవరూ నన్ను గుర్తుపట్టకుండా..బుర్కా వేసుకుని థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. పవన్ రేంజ్ అంటే అలా ఉంటుంది. ఎవరైనా ఆయనకు అభిమానులే అంటూ పవన్ ఫ్యనస్ ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. ఇకపోతే అనుపమ ప్రస్తుతం ‘బటర్ ఫ్లై’, ’18 పేజిస్’, ‘కార్తికేయ 2’ సినిమాలు చేస్తోంది.

Exit mobile version