Site icon NTV Telugu

Dj Tillu 2: డీజే టిల్లు 2 నుంచి అనుపమ అవుట్.. చైతన్య బ్యూటీ ఇన్..?

Tillu

Tillu

Dj Tillu 2: డీజే తిళ్ళు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ. ఇక ఈ స్టార్ స్టేటస్ తోనే క్యారెక్టర్ ఆర్టిస్టు గా చేయడం మానేసి తనకు పేరుతెచ్చిపెట్టిన డీజే తిళ్ళు 2 ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాకు తానే మాటలు అందిస్తున్నాడు. మాలిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తున్నాడు. ఇకపోతే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డీజే టిల్లు లో సిద్దు సరసన నేహా శెట్టి నటించి మెప్పించింది. ఇక డీజే టిల్లు 2 లో మొదట శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే శ్రీలీల ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది.

సిద్దు కూడా అనుపమనే హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించాడు కూడా.. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా నుంచి అనుపమ కూడా అవుట్ అంటూ వార్తలు గుప్పమంటున్నాయి. ఇక ఈసారి అనుపమ ప్లేస్ ను ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియాన్ భర్తీ చేస్తుందని చెప్పుకొస్తున్నారు. అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో అమ్మడు తెలుగు తెరకు పరిచయమైంది. ఇక గతేడాది శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో కొద్దిసేపు కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ కథకు ప్లాట్ అయ్యి వెంటనే ఓకే చెప్పిందని టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version