Anupama Lockdown First Look: హీరోయిన్ కెరీర్ గ్రాఫ్ పెరగాలంటే రూల్స్ ని బ్రేక్ చేయాలి. కొత్త కథలతో గ్లామర్ కిక్ ఇవ్వాలి. అప్పుడే క్రేజీ ఆఫర్స్ తలుపు తడతాయి. అదే పాయింట్ ని క్యాచ్ చేసిన అనుపమ గ్లామర్ షో కి గేట్లు తెరిచి, ట్రోల్స్ కి గురైంది. అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో మొన్నటి వరకు పద్దతైన పాత్రలు చేసి టిల్లు స్క్వేర్ తో గ్లామర్ డాల్ గా మారిపోయింది. సినిమాలో ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది. అనుపమ ఇంత హాట్ గా ఉంటుందా అనే కామెంట్స్ వచ్చాయి. అయితే పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసి బోర్ కొట్టిందని, కమర్షియల్ మీటర్ లో నటనకు అవకాశం ఉన్న లిల్లి పాత్ర రావడంతో ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు అనుపమ ముందే చెప్పింది.
Pawan kalyan: ప్రధాని కాళ్లపై పడ్డ పవన్.. మోడీ షాకింగ్ రియాక్షన్
ఇక ఆ తరువాత ఆమె నుంచి పరదా అనే సినిమా అప్డేట్ రాగా అది చూసి కూడా జనం కాస్త ఎగ్జైట్ అయ్యారు. ఎందుకంటే ఆమె ఇలాంటి పాత్రలు ఎంచుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఇక ఇప్పుడు ఆమె లాక్ డౌన్ అనే మరో ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ జీవా డైరెక్షన్ చేస్తూ కథ అందించారు. టైటిల్ ను బట్టి చూస్తే నిజంగానే లాక్ డౌన్ నేపథ్యంలోనే సినిమా ఉంటుందని అర్ధం అవుతోంది. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. మరి చూడాలి ఓవరాల్ గా సినిమా ఎలా ఉంటుంది అనేది.